కట్నం కింద ‘థార్’ అడిగితే.. బొమ్మ కారు ఇచ్చారు.. వీడియో వైరల్
ABN , Publish Date - Nov 29 , 2026 | 09:16 PM
కట్నం కింద తమకు ‘థార్’ కారు కావాలని డిమాండ్ చేసిన వరుడి కుటుంబానికి వధువు ఫ్యామిలీ మతిపోయే షాక్ ఇచ్చింది. వారి కోరిక మేరకు బొమ్మ కారును కానుకగా సమర్పించింది.
ఇంటర్నెట్ డెస్క్: కట్నం కింద తమకు ‘థార్’ కారు కావాలని డిమాండ్ చేసిన వరుడి కుటుంబానికి వధువు ఫ్యామిలీ మతిపోయే షాక్ ఇచ్చింది. వారి కోరిక మేరకు బొమ్మ కారును కానుకగా సమర్పించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన ఈ ఆసక్తికర ఘటన.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. కట్నం డిమాండ్ చేసినవారికి భలే బుద్ధి చెప్పారంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భదోహి జిల్లా జ్ఞాన్‌పూర్ గ్రామంలో నివసించే షంషేరా అనే వ్యక్తి తన కుమారుడి వివాహం కోసం సంబంధాలు చూస్తున్నాడు. ఈ క్రమంలో అదే జిల్లాలోని సోలనా గ్రామానికి చెందిన ఓ యువతికి, షంషేరా కుమారుడికి పెళ్లి కుదిరింది. వీరిద్దరికీ నిన్న(శనివారం) నిశ్చితార్థం జరిగింది. ఈ నేపథ్యంలో తమకు రూ.10 లక్షలు విలువ చేసే ‘థార్’ కారు కట్న కానుకల కింద ఇవ్వాలని వరుడి కుటుంబం డిమాండ్ చేసింది.
ఈ డిమాండ్‌ను విన్న వధువు కుటుంబం వెంటనే స్పందించలేదు. విషయం తెమలదని భావించిన వరుడి బంధువులు బయటకు వెళ్లిపోతుంటే.. వధువు ఫ్యామిలీ ఆపింది. ‘మీరు అడిగింది థారే కదా..? ఇదిగో తీసుకోండి’ అంటూ వారి చేతిలో కానుక పెట్టింది. అయితే అది నిజమైన కారు కాదు.. బొమ్మ కారు. దీంతో షంషేరా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరకట్న నిషేధ చట్టాలు అమలులో ఉన్నా.. ఎలాంటి ఫలితమూ ఉండడం లేదని కొందరు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. వధువు కుటుంబం చేసిన పనిని చాలామంది మెచ్చుకున్నారు.
ఇవీ చదవండి
మార్కెట్‌లోకి మళ్లీ గోల్డ్ స్పాట్.. ఢిల్లీలో అందుబాటులో ఉన్న ఓజీ డ్రింక్
నేపాల్‌లో భారతీయ మహిళకు షాక్.. గుహలో చిక్కుకుపోయి..