Share News

పర్యాటకులపై పడిన పాము.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. షాకింగ్ వీడియో

ABN , Publish Date - Sep 17 , 2026 | 06:45 PM

మహారాష్ట్రలోని అంబోలి జలపాతం వద్ద పైనుంచి నీటి ప్రవాహం వేగంగా కిందకి పడుతోంది. ఆ సమయంలో పెద్ద పాము ఆ నీటి ప్రవాహంతోపాటు కింద పడింది. అది కూడా అక్కడ ఉన్న ఓ ఫ్యామిలీపై పడింది.

పర్యాటకులపై పడిన పాము.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. షాకింగ్ వీడియో

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని అంబోలి జలపాతం వద్ద పైనుంచి నీటి ప్రవాహం వేగంగా కిందకి పడుతోంది. ఆ సమయంలో పెద్ద పాము ఆ నీటి ప్రవాహంతోపాటు కింద పడింది. అది కూడా అక్కడ ఉన్న ఓ ఫ్యామిలీపై పడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంబోలి జలపాతం వద్ద పెద్ద రాయిపై ముగ్గురు యువతులు కూర్చొని ఉన్నారు. ఆ పక్కనే చిన్నారిని ఓ వ్యక్తి ఎత్తుకుని నిలుచున్నాడు. ఆ వ్యక్తిపై పెద్ద పాము పడింది. షార్ట్ వేసుకున్న వ్యక్తి.. ఆ పామును గమనించి కిందికి చూశాడు.


అప్పటికే పాము అక్కడి నుంచి రాళ్ల మధ్యకు వేగంగా వెళ్లిపోయింది. దీనిని సెల్ ఫోన్‌లో చిత్రీకరించేందుకు యువకులు ప్రయత్నించారు. అయితే ఇది కట్ల పామా? లేక నల్ల త్రాచా? అన్న విషయం మాత్రం తెలియలేదు. ఈ వీడియోను డిజిటల్ ప్రైమ్ న్యూస్‌లో పోస్ట్ చేశారు.


ఈ వీడియోను వీక్షించి.. లైక్ చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. వర్షాకాలంలో చిన్న పిల్లలతో జారే స్వభావం ఉన్న ప్రాంతంలో పర్యటించడం అంత మంచిది కాదని అంటున్నారు. వన్యప్రాణులు సంచరించే జలపాత ప్రాంతాలను సందర్శించే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని పర్యాటకులను నెటిజనులు హెచ్చరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డ్రోన్‌ సాయంతో కుక్కకు స్నానం.. వీడియో చూస్తే అవాక్కవుతారు..

అదుపు తప్పి పడిపోయిన స్కూల్ వ్యాన్.. పిల్లలు సేఫ్

Updated Date - Sep 17 , 2026 | 07:07 PM