Share News

అదుపు తప్పి పడిపోయిన స్కూల్ వ్యాన్.. పిల్లలు సేఫ్

ABN , Publish Date - Sep 17 , 2026 | 03:24 PM

పిల్లలతో వెళుతున్న ఓ స్కూల్ వ్యాన్ అదుపు తప్పి రోడ్డుపై నుంచి దిగువన ఉన్న మరో రోడ్డుపై పడిన ఘటన యూపీలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

అదుపు తప్పి పడిపోయిన స్కూల్ వ్యాన్.. పిల్లలు సేఫ్
Ghaziabad School Van Accident

ఇంటర్నెట్ డెస్క్: పిల్లలతో వెళుతున్న ఓ స్కూల్ వ్యాన్ అదుపు తప్పి రోడ్డుపై నుంచి దిగువన ఉన్న మరో రోడ్డుపై పడిన ఘటన యూపీలో వెలుగు చూసింది. ఈ ఘటనలో పిల్లలు క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘాజియాబాద్‌లో గురువారం ఈ ఘటన వెలుగు చూసింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఉదయం 7.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో వ్యాన్‌ను లఖన్ అనే వ్యక్తి డ్రైవ్ చేస్తున్నాడు. వ్యాన్‌లో 13-14 ఏళ్ల వయసున్న నలుగురు పిల్లలు ఉన్నారు. చిన్నారుల తల్లిదండ్రులే ఈ వ్యాన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతాప్ నగర్‌లో వెళుతుండగా వ్యాన్ అదుపు తప్పి రోడ్డుపై నుంచి దిగువన ఉన్న మరో రోడ్డుపై పడిపోయింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పిల్లలు ఆ తరువాత యథాప్రకారం స్కూల్‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.


మరోవైపు, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వ్యాన్ అకస్మాత్తుగా అదుపు తప్పడానికి కారణం ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

2029 ప్రధాని అభ్యర్థి రేసు: రాహుల్ గాంధీ వర్సెస్ సీఎం విజయ్?

76 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా, ఆరోగ్యంగా మోదీ.. ప్రధాని డైట్ సీక్రెట్ ఏంటో తెలుసా?

Updated Date - Sep 17 , 2026 | 03:33 PM