డ్రోన్ సాయంతో కుక్కకు స్నానం.. వీడియో చూస్తే అవాక్కవుతారు..
ABN , Publish Date - Sep 17 , 2026 | 04:13 PM
ఇంట్లో పెంచుకునే కుక్కలకు పైప్ నీటితోనో లేక బక్కెట్‌లో నీరు తీసుకుని స్నానం చేయించడం అందరికీ తెలిసిందే. కానీ ఓ కుక్కకు డ్రోన్ సాయంతో స్నానం చేయించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: పెంపుడు కుక్కలకు పైప్ నీరు లేక బక్కెట్ నీటితో స్నానం చేయించడం అందరికీ తెలిసిందే. కానీ ఓ కుక్కకు మాత్రం డ్రోన్ సాయంతో స్నానం చేయించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. ఓ ఇంటి ఆవరణలో రహదారిపై కుక్క నిలబడి ఉంది. పైన డ్రోన్ ఎగురుతోంది. అందులో నుంచి రెండు పైపుల ద్వారా నీరు చాలా ఫోర్స్‌గా బయటికి వస్తోంది. అలా ఆ డ్రోన్ సాయంతో కుక్కకు స్నానం చేయిస్తున్నారు. కుక్కపై మనుషులు చల్లినట్లుగానే ఈ డ్రోన్ కూడా నీటిని కొడుతోంది. డ్రోన్ నీటిని కొడుతుంటే.. కుక్క స్నానం చేస్తూ ఎంజాయ్ చేస్తోంది.
ఈ వీడియోను ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన తూర్పు చైనా షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని లిన్యిలో చిత్రీకరించారు. చైనాలోని ఓ సంస్థ ఫొటోవోల్టాయిక్ ప్యానెళ్లను శుభ్రం చేయడం కోసం ఈ డ్రోన్లను రూపొందించింది. ఈ డ్రోన్లను ఆ సంస్థ పరిక్షిస్తోంది. ఈ క్రమంలో ఈ వీడియోను చిత్రీకరించారు. తమ సంస్థ ఉత్పత్తి చేసిన డ్రోన్ ఎంత బాగా పనిచేస్తుందో ప్రజలకు వివరించడం కోసం.. కుక్కకు ఏరియల్ షవర్ ద్వారా స్నానం చేయించారు.
ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆ డ్రోన్‌తో చాలా విభిన్నమైన మార్గాన్ని ఆ సంస్థ ఎన్నుకుందని ఓ నెటిజన్ తెలిపారు. డ్రోన్ నుంచి వచ్చిన నీటితో స్నానాన్ని కుక్క చాలా బాగా ఆస్వాదించిందని తెలిపారు. ఇప్పటికే డ్రోన్లతో ఆహారం ప్యాకేజీ చేసి.. వాటిని డెలివరీ చేస్తున్నారు. తాజాగా మరో కొత్త రకం డ్రోన్ల సేవలను చైనా వినియోగంలోకి తీసుకువస్తుందని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అదుపు తప్పి పడిపోయిన స్కూల్ వ్యాన్.. పిల్లలు సేఫ్
బిర్యానీ ఇలా కూడా తినొచ్చా.. చైనా యువతి స్పూన్‌లను ఎలా పట్టుకుందో చూడండి..