Share News

నిర్లక్ష్యపు డ్రైవింగ్.. ప్రాణాలతో చెలగాటం.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 29 , 2026 | 04:09 PM

మహారాష్ట్రలోని మల్షేజ్ ఘాట్‌లో ఓ పికప్ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపి పలువురి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన డాష్‌క్యామ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. చివరకు వాహనదారు అతడిని అడ్డగించి పోలీసులకు అప్పగించారు.

నిర్లక్ష్యపు డ్రైవింగ్.. ప్రాణాలతో చెలగాటం.. వీడియో వైరల్
Malshej Ghat Viral Video

ముంబై, జులై 29: మహారాష్ట్రలోని మల్షేజ్ ఘాట్ గుండా ఓ పికప్ ట్రక్కును నిర్లక్ష్యంగా నడుపుతూ.. వాహనాలను, ఒక బైకర్‌ను త్రుటిలో తప్పించుకుంటున్నట్లుగా డాష్‌క్యామ్ వీడియో వైరల్ అయింది. ఈ ఘటనలో డ్రైవర్ పలువురి వాహనదారుల ప్రాణాలకు ప్రమాదం కలిగించగా.. కొంతమంది వాహనదారులు అతడిని ఆపి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన జులై 24న జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


పికప్ ట్రక్కు వెనుక ప్రయాణిస్తున్న కారు నుంచి రికార్డ్ చేసిన ఈ వీడియోలో.. ట్రక్కు డ్రైవర్ ప్రమాదకరంగా లేన్‌లను దాటుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది. ఒకానొక సమయంలో ఆ ట్రక్కు రహదారి పక్కన ఉన్న ఓ పెద్ద నీటిగుంటలోకి దూసుకెళ్లడం, హఠాత్తుగా తిరిగి రహదారిపైకి రావడమూ కనిపిస్తుంది. ఆ బైకర్ దాదాపు రహదారి నుంచి పక్కకు పడిపోయేంత పని జరిగింది. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాలను ఓవర్‌టేక్ చేస్తూ ముందుకు వెళ్తుండటం చర్చనీయాంశమైంది. చాలాసేపు వెంబడించిన తర్వాత ట్రక్కును పలువురు వాహనదారులు అడ్డుకున్నారు.

డ్రైవర్ ట్రక్కులో కూర్చుని మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతుండగా, అక్కడున్న కొందరు అతడిని చెంపదెబ్బలు కొట్టారు. కొద్దిసేపటికే ఒక పోలీస్ ఎస్‌యూవీ సంఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సల్ చేయడం సహా కఠిన శిక్ష విధించాలని కోరుతున్నారు.


ఇవి కూడా చదవండి

ఐసీసీ ర్యాంకింగ్స్: వన్డేల్లో గిల్ టాప్.. టీ20ల్లో 230 స్థానాలు ఎగబాకిన వైభవ్

జగన్ క్రెడిట్‌ చోరీ చేస్తే జైలుకే.. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సెటైర్

Updated Date - Jul 29 , 2026 | 05:10 PM