మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకుడు.. పోలీస్‌పై దాడి..
ABN , Publish Date - Jul 27 , 2026 | 09:33 PM
మహారాష్ట్రలో ఓ యువకుడు మద్యం మత్తులో రెచ్చిపోయాడు. విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడు. కర్రతో విచక్షణా రహితంగా పోలీస్ కానిస్టేబుల్‌ను కొట్టాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: మహారాష్ట్రలో ఓ యువకుడు మద్యం మత్తులో రెచ్చిపోయాడు. విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడు. కర్రతో విచక్షణా రహితంగా పోలీస్ కానిస్టేబుల్‌ను కొట్టాడు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. థానే జిల్లాలోని కల్యాణ్ వెస్ట్, గౌరీపదకు చెందిన రాహుల్ అనే యువకుడు మద్యం మత్తులో రెచ్చిపోయాడు. తనుండే ఏరియాలో అలజడి సృష్టించసాగాడు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే గణేశ్ చవన్ అనే కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి వెళ్లాడు.
రాహుల్‌ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే, మద్యం మత్తులో రాహుల్ విచక్షణ కోల్పోయాడు. పోలీస్ కానిస్టేబుల్‌పై దాడికి దిగాడు. కర్రతో విచక్షణా రహితంగా కొట్టాడు. కానిస్టేబుల్‌పై దాడి చేసిన అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు రాహుల్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అభిషేక్ శర్మ వరుస వైఫల్యాలు.. టీమిండియాలో స్థానం శాశ్వతమేనా?
రాజ్యాంగ స్ఫూర్తితోనే విధులు నిర్వర్తిస్తున్నా: రంగనాథ్