ట్రెక్కింగ్ చేస్తూ పట్టు తప్పి లోయలో పడిన యువకుడు.. చివరికి ఏమైందంటే!
ABN , Publish Date - Jul 23 , 2026 | 03:19 PM
లోనావాలాలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువకుడు లోతైన లోయలో పడిపోయి చెట్టుకు చిక్కుకున్నాడు. స్థానికులు, సహాయక బృందాల సాహసోపేత ప్రయత్నాలతో అతడిని సురక్షితంగా రక్షించిన వీడియో వైరల్‌గా మారింది..
ఇంటర్నెట్ డెస్క్: లోనావాలాలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువకుడు.. లోయలోకి జారిపడబోతూ చెట్టుకు చిక్కుకున్నాడు. స్థానికులు, సహాయక బృందాలు కలిసి అతడిని సురక్షితంగా రక్షించిన వీడియో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని పుణె జిల్లా లోనావాలాలో ఒక యువ ట్రెక్కర్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో అతడు జారి లోతైన లోయలో పడిపోయి, అదృష్టవశాత్తూ ఒక చెట్టు కాండానికి చిక్కుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం స్థానికులు, సహాయక సిబ్బంది తాళ్ల సహాయంతో అతడిని సురక్షితంగా పైకి తీసుకొచ్చారు. ఈ ఉత్కంఠభరిత రెస్క్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఘటన జరిగిన ఖచ్చితమైన ప్రదేశం, యువకుడి వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
వర్షాకాలంలో ట్రెక్కింగ్ చేస్తే ఎంత ప్రమాదమో ఈ ఘటన ద్వారా తెలుస్తోంది. లోనావాలా, మావల్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ట్రెక్కింగ్ మార్గాలు, కొండచరియలు, గుట్టలు జారుడుగా మారాయి. భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) పుణె ఘాట్ ప్రాంతానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పూణే జిల్లా యంత్రాంగం భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 163 కింద ఆగస్టు 31 వరకు లోనావాలా గ్రామీణ ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమలు చేస్తోంది. టైగర్ పాయింట్, లోహగడ్ కోటతో పాటు జలపాతాలు, పొంగిపొర్లుతున్న వాగులు, కొండ అంచుల వీక్షణ ప్రాంతాలకు వెళ్లవద్దని పర్యాటకులకు సూచించింది.
ఇవి కూడా చదవండి..
భూకబ్జాలో సూత్రధారి సీతారాం.. పాత్రధారి ఆయన కుమారుడు: ఎమ్మెల్యే కూన రవికుమార్
ఏపీకి మరో అంతర్జాతీయ పెట్టుబడి.. యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు
Read Latest AP News And Telugu News