డెలివరీ బాయ్‌పై చిరుత దాడి.. ఆ తర్వాత ఏమైందంటే..
ABN , Publish Date - Jul 09 , 2026 | 03:58 PM
డెలివరీ బాయ్‌పై చిరుత దాడి చేసింది. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: అడవుల్లో పులులు, సింహాలు, చిరుతలు, ఏనుగులు తదితర జంతువులు ఉంటాయి. కానీ దేశవ్యాప్తంగా అడవుల శాతం దాదాపుగా తగ్గిపోయింది. దీంతో ఆహారం, ఆశ్రయం కోసం అడవుల్లోని జంతువులన్నీ పట్టణాలు, గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. ఓ డెలివరీ బాయ్‌పై చిరుత దాడి చేసింది. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇందౌర్‌లోని బిచోలి మర్దనా ప్రాంతంలో చోటుచేసుకుంది.
అర్థరాత్రి సమయంలో రహదారిపై వాహనాలు, ప్రజల రాకపోకలు లేవు. అదే సమయంలో డెలివరీ బాయ్ బైక్‌పై వెళ్తున్నాడు. అకస్మాత్తుగా చిరుత ఎదురు వచ్చింది. దీంతో బైక్‌ను ఆపాడు. అంతలో అతడిపై చిరుత దాడి చేసింది. భయంతో అతడు నడిరోడ్డుపై బైక్ వదిలి పరుగులు తీశాడు. చిరుత కూడా వేగంగా పరుగులు తీసింది. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
దీంతో అటవీ శాఖ సిబ్బందితోపాటు స్థానిక అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. రాత్రి సమయంలో ఒంటరిగా బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఫలితం దారుణంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి..
కాలు లేకున్నా.. ఆత్మవిశ్వాసం కోల్పోలేదు.. వీడియో వైరల్
లోకో పైలట్ సమోసాల కొనుగోలు వీడియోపై స్పందించిన రైల్వే శాఖ
For More Viral News And Telugu News