Share News

Haryana: 10 మంది కుమార్తెల తర్వాత కుమారుడికి జన్మనిచ్చింది.. తల్లి ఆరోగ్యంపై ఆందోళన

ABN , Publish Date - Jan 06 , 2026 | 09:59 PM

హర్యానాలో జరిగిన ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన కొన్ని ప్రాంతాల్లో మగ పిల్లల పట్ల కొనసాగుతున్న ప్రాధాన్యతకు అద్దం పట్టేలా ఉంది.

Haryana: 10 మంది కుమార్తెల తర్వాత కుమారుడికి జన్మనిచ్చింది.. తల్లి ఆరోగ్యంపై ఆందోళన
Haryana Gender Bias Case

భారత దేశంలో అన్ని రంగాల్లో మహిళలు మగవారితో పోటీ పండి ముందుకు వెళ్తున్నారు. కానీ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్ల అంటే వివక్ష కొనసాగుతూనే ఉంది. కుటుంబానికి వారసుడు కావాలని కట్టుకున్న భార్యను భర్త, అత్తమామలు హింసలు పెడుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. అలాంటి ఘటనే ఒకటి హర్యానా రాష్ట్రం జింద్ జిల్లాలోని ఉచానా పట్టణంలో చోటు చేసుకుంది. 19 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఓ మహిళ ఉచావా పట్టణంలోని ఓజాస్ ఆస్పత్రిలో తన 11 వ మగ బిడ్డకు జన్మనిచ్చింది. డాక్టర్ నర్వీర్ షియోరన్ ప్రకారం.. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా ఉందని తెలిపారు. ఆమెకు మూడు యూనిట్ల రక్తం అవసరం అని, కాకపోతే ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. జనవరి 3న ఆ మహిళ ఆస్పత్రిలో చేగా, మరుసటి రోజే బిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే ఆమెనె డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్ తెలిపారు.


ఇదిలా ఉంటే.. ఆ మహిళ అప్పటికే 10 మంది ఆడపిల్లలకు జన్మనిచ్చింది. మగ సంతానం కోసం ఇన్నాళ్లు ఎదురు చూడగా.. వారి ఆశ ఫలించింది. ఈ విషయం గురించి ఆమె భర్త సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘నా పెద్ద కూతురు ప్రస్తుతం 12వ తరగతి చదువుతుంది. నాకు పరిమితమైన ఆదాయం ఉన్నప్పటికీ పిల్లలందరికీ మంచి విద్యనందిస్తున్నాను. మా ఇంట్లో మొత్తం ఆడవాళ్లే ఉన్నారు... నాకు మగ పిల్లవాడు కావాలని కోరుకున్నా.. అందుకే నా భార్యకు ఆపరేషన్ చేయించలేదు. మొత్తానికి పదకొండో సంతానంగా నాకు మగపిల్లాడు పుట్టాడు. దీన్ని బట్టి ఈ ప్రాంతాల్లో మహిళల ఆరోగ్యం విషయం పట్టించుకోకుండా మగ సంతానం కోసం ఎదురు చూస్తున్నారు. హర్యానాలో లింగ నిష్పత్తిపై కొనసాగుతున్న పరిశీలన మధ్య ఈ కేసు వచ్చింది.


ఇవి కూడా చదవండి..

ఎస్ఐఆర్ కోసం బీజేపీ యాప్.. ఈసీపై మమత సంచలన ఆరోపణ

ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 06 , 2026 | 10:01 PM