Share News

చెత్తకుప్పలో చాక్లెట్లు.. ఎగబడిన జనం.. వీడియో వైరల్

ABN , Publish Date - Aug 25 , 2026 | 02:57 PM

రహదారి పక్కన గుట్టలు గుట్టలుగా పడేసిన చాక్లెట్లు, బిస్కెట్లను తీసుకెళ్లేందుకు జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఎవరికి వారు అందినకాడికి దోచుకెళ్లారు. అసలేం జరిగిందంటే.?

చెత్తకుప్పలో చాక్లెట్లు.. ఎగబడిన జనం.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: రహదారి పక్కన గుట్టలు గుట్టలుగా పడేసిన చాక్లెట్లు, బిస్కెట్లను తీసుకెళ్లేందుకు ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. ఎవరికి వారు అందినకాడికి ప్యాకెట్లు, డబ్బాలు పట్టుకెళ్లారు. కొందరు ఆ ప్యాకెట్లు తీసుకెళ్తుంటే.. మరికొందరు వాటి కోసమే అక్కడికి చేరుకుంటున్నారు. ఈ ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎవరి చేతనైనంత వాళ్లు చాక్లెట్ల డబ్బాలు, బిస్కెట్ల ప్యాకెట్లను ఎత్తుకెళుతుండటంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.


ఎక్స్‌పైరీ డేట్(గడువు) ముగిసిన చాక్లెట్ డబ్బాలు, ప్యాకెట్లను ఎవరో భారీఎత్తున చెత్తలో పడేశారు. చెత్తకుప్పలో భారీగా ఉన్న చాక్లెట్ల కుప్పలను స్థానికులు సహా అటుగా వెళ్తున్నవారు గమనించారు. తమ వాహనాలను ఆపి మరీ చెత్తలో చాక్లెట్ల ప్యాకెట్ల కోసం ఎగబడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లో పాంకిలోని పారిశ్రామిక ప్రాంతంలో చోటు చేసుకుంది.


ఈ వీడియోను @Mariyam_MBD అనే యూజర్.. తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఉచితంగా వస్తాయనే అత్యాశతో ఇలా చాక్లెట్లు, బిస్కెట్ల కోసం జనం ఎగబడుతున్నారని కొందరు వ్యాఖ్యానించారు. ఈ వీడియో ప్రజల అవగాహనా లోపాన్ని తెలుపుతోందని మరికొందరు చెబుతున్నారు. అయినా గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఇలా బహిరంగంగా ఎందుకు పడేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మా ఇంటి రెంటు, మెయింటెనెన్స్ ఖర్చే రూ.60 వేలు.. మహిళ పోస్టు వైరల్

ముంబై లోకల్ రైల్లో యువతుల పాట్లు.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే

For More Viral News And Telugu News

Updated Date - Aug 25 , 2026 | 03:59 PM