Share News

మా ఇంటి రెంటు, మెయింటెనెన్స్ ఖర్చే రూ.60 వేలు.. మహిళ పోస్టు వైరల్

ABN , Publish Date - Aug 24 , 2026 | 09:58 PM

తమ నెలవారీ ఖర్చులు ఎలా ఉంటాయో చెబుతూ ఓ మహిళ నెట్టింట షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.

మా ఇంటి రెంటు, మెయింటెనెన్స్ ఖర్చే రూ.60 వేలు.. మహిళ పోస్టు వైరల్
Couple Monthyl Expense Video

ఇంటర్నెట్ డెస్క్: నేటి కాలంలో అనేక జంటలు రెండు చేతులా సంపాదిస్తున్నాయి. అంతే స్థాయిలో ఖర్చు చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాయి. అలాంటి ఓ జంట ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. జనాలు షాకైపోయేలా చేస్తోంది. శుభీ ఖండేల్వాల్ అనే మహిళ ఈ పోస్టు పెట్టింది. ఆమె తన భర్తతో కలిసి బెంగళూరులో ఉంటోంది. తమ నెలవారీ ఖర్చు రూ.1.7 లక్షలంటూ ఆమె పెట్టిన పోస్టు నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఈ వీడియో షేర్ చేసింది. తమ ఇంటి రెంటు, మెయింటెనెన్స్ ఖర్చే నెలకు రూ.60 వేలని ఆమె చెప్పుకొచ్చింది. పచారీ సామాన్లకు రూ.14 వేల వరకూ ఖర్చు అవుతోందని చెప్పింది. వంట, ఇంటి పనుల్లో సహాయం చేసే వారికి కలిపి మరో రూ.8 వేలు చెల్లిస్తున్నామని చెప్పింది. వీకెండ్‌లో విహార యాత్రలకు వెళ్లేందుకు మరో రూ.10 వేలు ఖర్చు చేస్తుంటామని చెప్పింది. పెట్రోల్, క్యాబ్ ఖర్చులు మరో రూ.3,500 వరకూ ఉంటాయని చెప్పింది. షాపింగ్‌కు మాత్రం రూ.3 వేలే ఖర్చు చేస్తామని పేర్కొంది. ఇతరత్రా ఖర్చులు కూడా ఉంటాయని పేర్కొంది.


అయితే, టూర్లకు వెళ్లడంపైనే తాము ఎక్కువగా ఖర్చు చేస్తామని శుభి పేర్కొంది. ఏడాదికి రూ.9 లక్షలకు పైగా ఖర్చు చేస్తామని చెప్పింది. ఇలా అన్నీ కలిపితే నెలకు రూ.1.7 లక్షలు ఖర్చవుతాయని చెప్పింది. బెంగళూరు మహానగరం కావడంతో ఇక్కడి ఇంటి రెంట్లు ఆకాశాన్ని తాకుతుంటాయని, లేకపోతే తమ లాంటి ఇళ్లు ఇతర నగరాల్లో ఇంతకంటే తక్కువ ధరకే అందుబాటులో ఉండవచ్చని పేర్కొంది. ఈ పోస్టుపై జనాలు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ముంబై లోకల్ రైల్లో యువతుల పాట్లు.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే

జీవితమంతా భిక్షాటన చేస్తూ.. పైసా పైసా కూడబెట్టింది.. చివరికి..

Updated Date - Aug 24 , 2026 | 10:03 PM