Share News

ముంబై లోకల్ రైల్లో యువతుల పాట్లు.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే

ABN , Publish Date - Aug 24 , 2026 | 07:48 PM

ముంబై లోకల్‌ రైల్లో యువతి చేసిన ప్రమాదకర ప్రయాణం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..

ముంబై లోకల్ రైల్లో యువతుల పాట్లు.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే
Mumbai Local Viral Video

ఇంటర్నెట్ డెస్క్: ముంబై లోకల్ రైల్లో ప్రయాణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లోకల్ రైళ్లన్నీ నిత్యం ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ యువతి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. రైల్లోకి వెళ్లేందుకు కూడా చోటు లేకపోవడంతో.. ఆమె తలుపు వద్ద ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణించింది. రైలు వేగంగా దూసుకెళ్తుండగా ఆమె అలా ప్రమాదకరంగా ప్రయాణించిన దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.


రైలు బ్రిడ్జిని దాటుతున్న సమయంలో అక్కడి ఇనుప గ్రిల్స్ యువతికి అత్యంత సమీపంగా ఉన్నాయి. ప్రమాదం జరిగే పరిస్థితి కనిపించడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అదృష్టవశాత్తూ ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ.. రద్దీ ఎంత ఉన్నా ఫుట్‌బోర్డ్‌పై లేదా రైలు బయట వేలాడుతూ ప్రయాణించడం ఏమాత్రం సురక్షితం కాదని హెచ్చరిస్తున్నారు. కొన్ని నిమిషాలు ఆలస్యమైనా మరో రైలు కోసం వేచి ఉండటం మంచిదని, ప్రాణాలకు మించినది ఏదీ లేదని సూచిస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

న్యూఢిల్లీ - పాట్నా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాలు లేకుండా.. దేశాభివృద్ధి ఎలా సాధ్యం: అభిజీత్ దీప్కే

Updated Date - Aug 24 , 2026 | 08:00 PM