న్యూఢిల్లీ - పాట్నా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Aug 24 , 2026 | 04:32 PM
న్యూఢిల్లీ నుంచి పాట్నా బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. పాట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతున్న విమానాన్ని పక్షి ఢీ కొట్టింది.
పాట్నా, ఆగస్టు 24: న్యూఢిల్లీ నుంచి పాట్నా బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. పాట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతున్న విమానాన్ని పక్షి ఢీ కొట్టింది. ఈ అంశాన్ని ఎయిర్ పోర్ట్ అధికారుల దృష్టికి పైలట్ తీసుకెళ్లారు. దీంతో ఎయిర్ పోర్ట్‌లో ఫైర్, అత్యవసర సేవలను అధికారులు మోహరించారు. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన ఈ విమానానికి సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.
రన్ వేపై దిగుతున్నప్పుడు విమానం కుడి వైపు ఇంజిన్‌ను పక్షి ఢీకొట్టినట్లు పరిశీలనలో తెలిందన్నారు. కానీ విమానం ఇంజిన్‌కు ఎటువంటి నష్టం జరగలేదన్నారు. ఈ సమయంలో విమానంలో 160 మంది ప్రయాణికులు ఉన్నారని వివరించారు. భద్రతా తనిఖీల అనంతరం ఈ విమానం ఢిల్లీకి దాదాపు గంటన్నర ఆలస్యంగా బయలుదేరిందని ఎయిర్ పోర్ట్ అధికారులు వివరించారు. మరో వైపు ఈ వారంలో పాట్నా ఎయిర్ పోర్ట్‌లో విమానాన్ని పక్షి ఢీకొట్టిన ఘటనల్లో ఇది రెండోదని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాలు లేకుండా.. దేశాభివృద్ధి ఎలా సాధ్యం: అభిజీత్ దీప్కే
బాలికపై లైంగిక వేధింపులు.. ద్రోణాచార్య అవార్డు గ్రహీతపై పోక్సో కేసు
For More National News And Telugu News