పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాలు లేకుండా.. దేశాభివృద్ధి ఎలా సాధ్యం: అభిజీత్ దీప్కే
ABN , Publish Date - Aug 24 , 2026 | 04:01 PM
ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కన్వీనర్ అభిజీత్ దీప్కే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రాథమిక సౌకర్యాలు లేవన్నారు. ఈ నేపథ్యంలో దేశాభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కన్వీనర్ అభిజీత్ దీప్కే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రాథమిక సౌకర్యాలు లేవన్నారు. ఈ నేపథ్యంలో దేశాభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ప్రజా విద్యను ప్రాధాన్యతగా తీసుకొని పాఠశాలలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సోమవారం కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సీజేపీ కన్వీనర్ అభిజీత్ దీప్కే లేఖ రాశారు.
ఈ సమస్యను పరిష్కరించే ముందు ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సమాచారం అందుబాటులో ఉంచాలని కేంద్రాన్ని ఆయన కోరారు. అందుకు సంబంధించిన వివరాలను విద్యశాఖ బహిరంగ పర్చాలని విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్లలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు పునరుద్ధరించబడ్డాయని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఎన్నింటికి మరమ్మతులు లేదా పూర్తి పునర్నిర్మాణం అవసరం ఉందో వివరించాలని ఆ లేఖలో స్పష్టం చేశారు.
అలాగే ప్రస్తుతం ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేశారు. వాటిలో ఎన్ని భర్తీ అయ్యాయి? ఇంకా ఎన్ని ఖాళీగా ఉన్నాయో వెల్లడించాలని కోరారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలకు ఎన్ని నిధులు కేటాయించారు? అందులో ఎంత ఖర్చు చేశారు? కూడా తెలపాలని అన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు ఇంకా ఎన్ని అదనపు ప్రభుత్వ పాఠశాలలు అవసరం? అవుతాయో కూడా చెప్పాలని కేంద్ర విద్యా శాఖ మంత్రిని కోరారు.
బోధనతో పాటు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఇంకా ఇతర ఏఏ విధులు, బాధ్యతలు అప్పగించారో కూడా చెప్పాలని కేంద్రాన్ని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు, డిజిటల్ లెర్నింగ్ సౌకర్యాలు, శుభ్రంగా పని చేసే టాయిలెట్లు, సరైన క్రీడా సౌకర్యాలతోపాటు పరికరాలు ఉన్నాయో కూడా వివరించాలని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. అయితే ఈ లేఖ తాను రాజకీయం కోసం కాదని.. ఇది విద్యార్థుల భవిష్యత్తు గురించి రాసిన లేఖ అంటూ కేంద్ర విద్యా మంత్రి ప్రహ్లాద్ జోషికి అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
పడిక్కల్‌ను పక్కన పెట్టలేరు.. ఇక్కడ కోచ్‌గా గంభీర్‌కు పెద్దగా పని లేదు: క్రిస్ శ్రీకాంత్
బాలికపై లైంగిక వేధింపులు.. ద్రోణాచార్య అవార్డు గ్రహీతపై పోక్సో కేసు
For More National News And Telugu News