రైల్వే ట్రాక్‌పై ఏనుగులు.. దూసుకొచ్చిన రైలు.. వీడియో పోస్ట్ చేసిన సీఎం
ABN , Publish Date - Aug 21 , 2026 | 03:30 PM
రైల్వే ట్రాక్‌ను భారీ ఏనుగుల గుంపు దాటుతోంది. అంతలో ట్రాక్‌పై దూసుకు వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు కొంత దూరంలో ఆగిపోయింది. ఆ వీడియో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: రైల్వే ట్రాక్‌ను భారీ ఏనుగుల గుంపు దాటుతోంది. అంతలో ట్రాక్‌పై దూసుకు వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు కొంత దూరంలో ఆగిపోయింది. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఏనుగుల గుంపు ట్రాక్ వైపు రావడాన్ని అటవీ శాఖ అధికారి గుర్తించారు. వెంటనే ఆయన స్పందించారు. ట్రాక్‌పై వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును ఆపాలంటూ ఆయన సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఆ ఏనుగుల గుంపు ట్రాక్ దాటే వరకు రైలును ఆపేశారు. ఈ వీడియోను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అటవీ ప్రాంతంలో రైల్వే ట్రాక్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్న ఫలితం మాత్రం దారుణంగా ఉంటుందని అంటున్నారు. అయితే అస్సాంలో ఇది సర్వ సాధారణం అని పేర్కొంటున్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై అధికారులు నిఘా ఉంచుతారు. అటవీ ప్రాంతంలో నుంచి వచ్చే ఏనుగుల గుంపును గమనించిన వెంటనే.. వారు రైల్వే అధికారులను లేదా ఎక్స్‌ప్రెస్ రైలులోని లోకో పైలట్‌ను అప్రమత్తం చేస్తారు. దీంతో ఆ జీవులు ట్రాక్ దాటే వరకు రైలును నిలిపివేస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మమ్మల్ని అలా పిలవద్దు.. నెటిజన్లను కదిలిస్తున్న చిన్నారి ఆవేదన
మృత్యువు అంచుల దాకా వెళ్లి తప్పించుకున్నాడు.. వీడియో వైరల్