Share News

మృత్యువు అంచుల దాకా వెళ్లి తప్పించుకున్నాడు.. వీడియో వైరల్

ABN , Publish Date - Aug 21 , 2026 | 02:58 PM

బెంగళూరులో గుంతలు, నీటితో నిండిన రోడ్డుపై ఓ బైకర్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గుంజూర్-పల్యా సీడీపీ రోడ్డుపై వెళ్తున్న సౌరభ్ అగర్వాల్‌ మోటార్‌సైకిల్‌ను నీటి ట్యాంకర్ అదుపుతప్పి ఢీకొట్టింది. వివరాల్లోకి వెళితే..

మృత్యువు అంచుల దాకా వెళ్లి తప్పించుకున్నాడు.. వీడియో వైరల్
Bengaluru Tanker Accident

ఇంటర్నెట్ డెస్క్: బెంగుళూరులో ఇటీవల వర్షాలు పడటంతో రోడ్లన్నీ దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే గుంజూర్-పల్యా సీడీపీ రోడ్డుపై ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. గుంతలు, నిలిచిన నీటితో ప్రమాదకరంగా మారిన రోడ్డుపై సౌరభ్ అగర్వాల్ మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా.. పక్కనే వచ్చిన నీటి ట్యాంకర్ అదుపుతప్పి ఆ బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదాన్ని ముందే గుర్తించిన అగర్వాల్ ట్యాంకర్ ఢీకొట్టడానికి క్షణాల ముందు బైక్‌ మీది నుంచి దూకడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.


ఎఫ్ఐఆర్ నమోదు.. ట్యాంకర్ డ్రైవర్ అరెస్ట్

ప్రమాదం అనంతరం సౌరభ్ అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. నీటి ట్యాంకర్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ట్యాంకర్‌పై రిజిస్ట్రేషన్ నంబర్ లేకపోవడం, డ్రైవర్‌కు పూర్తి అనుభవం లేదన్న ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి.


ఈ వార్తలు కూడా చదవండి

భారత నావికులు ప్రయాణిస్తున్న నౌకపై ఇరాన్ దాడి.. బయటకొచ్చిన వీడియో..

నేను వచ్చానని అద్దె విద్యార్థులను తీసుకొచ్చారు: అభిజీత్ సంచలన ఆరోపణలు..

Updated Date - Aug 21 , 2026 | 04:46 PM