Share News

మమ్మల్ని అలా పిలవద్దు.. నెటిజన్లను కదిలిస్తున్న చిన్నారి ఆవేదన

ABN , Publish Date - Aug 20 , 2026 | 10:23 PM

ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఓ చిన్నారి ఆవేదన ప్రస్తుతం నెటిజన్లను కదిలిస్తోంది. తమపై వివక్ష ప్రదర్శించొద్దంటూ ఆమె చేసిన విజ్ఞప్తి నెట్టింట ప్రస్తుతం సంచలనంగా మారింది.

మమ్మల్ని అలా పిలవద్దు.. నెటిజన్లను కదిలిస్తున్న చిన్నారి ఆవేదన
Arunachal Pradesh Child Viral Video

ఇంటర్నెట్ డెస్క్: ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఓ చిన్నారి ఆవేదన ప్రస్తుతం నెటిజన్లను కదిలిస్తోంది. తమపై వివక్ష ప్రదర్శించొద్దంటూ ఆమె చేసిన విజ్ఞప్తి నెట్టింట ప్రస్తుతం సంచలనంగా మారింది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ చిన్నారి తమను భారతీయులుగా సంబోధించాలంటూ చెప్పిన వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఆ బాలికను ఓ వ్యక్తి నువ్వు చైనా వ్యక్తివా అని అడిగారు. దీనికి చిన్నారి ఏ మాత్రం తడుముకోకుండా ఆ ప్రశ్నలోని జాత్యాహంకారాన్ని ఎత్తి చూపింది. ‘మేము భారతీయులము. మీరు మమ్మల్ని చైనీయులుగా పలిస్తే మాకు ఎంతో కోపం వస్తుంది. కన్నీళ్లు కూడా వస్తాయి. మమ్మల్ని భారతీయులుగా చూడండి. అలాగే పిలవండి. మేము ఇటానగర్‌లో ఉంటాము’ అంటూ ముచ్చటగొలిపే మాటలతో ఆమె చెప్పింది.


ఆ ప్రశ్న చిన్నారి మనసును ఎంతగా గాయపరిచిందో చెప్పే వీడియోను జనాలు తెగ వైరల్ చేస్తున్నారు. అనేక మంది చిన్నారిపై ప్రశంసలు కురిపించారు. ఈశాన్య రాష్ట్రాల వారు సొంత దేశంలోనే ఎలాంటి వివక్షను ఎదుర్కొంటున్నారో ఆ చిన్నారి మాటల్లో స్పష్టంగా అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. కొందరు చిన్నారికి స్వాంతన కలిగించే కామెంట్స్ కూడా చేశారు. ఇలాంటి ప్రశ్నలకు స్పందించాల్సిన అవసరం, అగత్యం లేనేలేదని మరికొందరు అభిప్రాయపడ్డారు.


ఈ వార్తలనూ చదవండి:

ఫ్రస్ట్రేషన్‌లో అలా అన్నా.. సారీ.. భారత ఆర్మీకి యువతి క్షమాపణ

‘నా యవ్వనం గురించి పగటి కలలు కనకండి’.. రామ్‌దేవ్‌కు కంగనా రనౌత్‌ స్ట్రాంగ్ కౌంటర్‌

Updated Date - Aug 20 , 2026 | 10:35 PM