ఎలా వస్తాయి భయ్యా ఇలాంటి ఐడియాలు.. ఇతడి తెలివి చూస్తే అవాక్కవాల్సిందే..
ABN , Publish Date - Jul 03 , 2026 | 03:55 PM
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ దివ్యాంగుడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అందులో అతను భిక్షాటన కోసం వినూత్నమైన ప్రయోగం చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వింతలు కనిపిస్తాయో ఊహించడం కష్టం. తాజాగా ఒక దివ్యాంగుడు భిక్షాటన కోసం చేసిన వినూత్న ప్రయోగం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచంలో విభిన్నంగా ఆలోచించే వారికీ కొదవే లేదు. ముఖ్యంగా మన దేశంలో ఇలాంటి వింత ఆలోచనలతో కూడిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి. రోజూ ఇంటర్నెట్‌లో ఎన్నో రకాల వీడియోలు చూస్తూ ఉంటాం. కానీ కొన్ని మాత్రం మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా సరిగ్గా అలాంటిదే.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో.. ఓ దివ్యాంగుడు మూడు చక్రాల వాహనంపై వచ్చి ఓ దుకాణం ముందు ఆగాడు. అతని చేతిలో ఒక పొడవాటి కర్ర ఉంది, దానిని అవసరాన్ని బట్టి చిన్నదిగా, పెద్దదిగా మార్చుకోవచ్చు. ఆ కర్ర చివర ఒక చిన్న జాలీ అమర్చబడి ఉంది. రోడ్డుపై వెళ్తున్న సమయంలో అతను ఆ కర్రను సాగదీసి, దూరాన ఉన్న దుకాణదారుడి వైపునకు తిప్పాడు. ఆ దుకాణదారుడు అందులో డబ్బులు వేశాడు. ఆ తర్వాత వృద్ధుడు ఆ కర్రను మళ్లీ చిన్నదిగా చేసుకుని, ఆ డబ్బులను తన వద్దకు తెచ్చుకుంటాడు. వాహనం దిగకుండా, ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా దూరం నుంచే భిక్షాటన చేసే ఈ సరికొత్త విధానాన్ని చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
ఈ వీడియో @NazneenAkhtar23 అనే యూజర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘వారెవ్వా.. ఇలాంటి ఐడియాలు మన దేశంలోనే సాధ్యం’ అని కామెంట్ చేయగా, ‘భిక్షాటనలో ఒక కొత్త పద్ధతిని మీరు చూడవచ్చు’ అని కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ సంస్థలకు గ్రీన్ సిగ్నల్
ఏపీ అభివృద్ధికి పరిశ్రమలు, పెట్టుబడులు అవసరం: హోం మంత్రి అనిత
Read Latest AP News And Telugu News