Share News

వ్యక్తి ప్రాణాల్ని కాపాడిన నర్సులు.. కదులుతున్న బస్సులోంచి కిందకు దిగి..

ABN , Publish Date - Jul 02 , 2026 | 07:18 PM

రోడ్డుపై హఠాత్తుగా గుండె పోటు బారిన పడ్డ ఒక వ్యక్తిని ఇద్దరు నర్సులు సీపీఆర్ చేసిన కాపాడారు. వ్యక్తి ఆపదలో ఉన్న విషయాన్ని గుర్తించిన వెంటనే రన్నింగ్ బస్సులోంచి దూకి మరీ సాయం అందించారు.

వ్యక్తి ప్రాణాల్ని కాపాడిన నర్సులు.. కదులుతున్న బస్సులోంచి కిందకు దిగి..
Kerala Nurses Saves Man's Life

ఇంటర్నెట్ డెస్క్: రోడ్డుపై హఠాత్తుగా గుండె పోటు బారిన పడ్డ ఒక వ్యక్తిని ఇద్దరు నర్సులు సీపీఆర్ చేసిన కాపాడారు. ఆ వ్యక్తి ఆపదలో ఉన్న విషయాన్ని గుర్తించిన వెంటనే రన్నింగ్ బస్సులోంచి దూకి మరీ సాయం అందించారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, సినోజ్ అనే వ్యక్తి ఒక్కల్ ప్రాంతంలో లాటరీ షాపు నిర్వహిస్తుంటారు. కారులో వెళుతుండగా ఛాతిలో నొప్పి రావడంతో కారును పక్కన నిలిపి క్షణాల్లో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అదే రోడ్డుపై బస్సులో వెళుతున్న నర్సు అంజలి బైజు, నర్సింగ్ స్టూడెంట్ ఆర్ద్ర సినోజ్ ఆపదలో ఉన్న విషయాన్ని గమనించారు. ఆలస్యం చేయకుండా రన్నింగ్ బస్సులోంచి దిగిపోయి సినోజ్‌కు సీపీఆర్ చేశారు. ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించే వరకూ సీపీఆర్ కొనసాగించారు.


ఆసుపత్రికి చేరుకున్నాక డాక్టర్లు సినోజ్‌కు అత్యవసరంగా యాంజియోప్లాస్టీ నిర్వహించి ప్రాణాలను కాపాడారు. మరింత మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకునేటప్పటికే సినోజ్ కోలుకుంటున్న లక్షణాలు కనిపించాయని అన్నారు. నర్సులు తక్షణం స్పందించడంతో సినోజ్ ప్రాణాలు నిలిచాయని చెప్పారు. దీంతో, ఆ ఇద్దరిపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

మలుపు తిప్పుతుండగా ఘోరం.. నేరుగా ఇనుప చువ్వలపై పడి..

మురుగు కాలువలో పడిపోయిన వ్యక్తి.. చివరకు ఏమైందో మీరే చూడండి..

Updated Date - Jul 02 , 2026 | 07:30 PM