Share News

Viral Video: వార్నీ.. కుక్కపిల్లను ఇలా కూడా వాడతారా.. వైరల్ వీడియో

ABN , Publish Date - Jan 13 , 2026 | 03:21 PM

మనిషి ఆలోచనలు ఎంత సృజనాత్మకంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తన అవసరాల కోసం దేనినైనా వాడుకుంటున్నాడు. తాజాగా.. ఇంటి గడపకు పెయింట్ వేస్తున్న ఇద్దరు అమ్మాయిల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Viral Video: వార్నీ.. కుక్కపిల్లను ఇలా కూడా వాడతారా.. వైరల్ వీడియో
Unique Painting Ideas

ఇంటర్నెట్ డెస్క్: ఇద్దరు అమ్మాయిలు చేసిన పనిచూస్తే.. ‘కుక్కపిల్లా.. సబ్బుబిళ్లా.. అగ్గిపుల్లా.. కాదేదీ కవితకనర్హం’ అని శ్రీశ్రీ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయేమో.! ఇంతకీ ఆ ఇద్దరు అమ్మాయిలు ఏం చేశారో తెలుసా.. తమ ఇంటి గడపకు స్పెషల్‌గా డిజైన్ చేస్తూ పెయింట్ వేస్తున్నారు. ఇందులో వెరైటీ ఏముంది.. ఎవరైనా ఇంటి గడప మంచి డిజైన్‌తో ఉండాలని చూస్తారు కదా అనుకుంటున్నారా. అయితే.. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. కుక్కపిల్లల పాదాలు వైట్ పెయింట్‌లో అద్ది.. దాన్ని గడపకు డిజైన్‌గా వేస్తున్నారు. చూస్తానికి ఇది కాస్త వెరైటీగా ఉన్నా ఆ అమ్మాయిలు చేస్తున్న పనిచూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు.


గడపకు ఇలా పెయింట్ వేసే పద్ధతి ఇదే మొదటిసారి చూడటం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను memezenon అనే యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘అమ్మా, నా శక్తులు దుర్వినియోగం అవుతున్నాయి’ అనే శీర్షికను దానికి జోడించారు. ఇద్దరు అమ్మాయిలు రెండు కుక్కపిల్లలను తీసుకుని పెయింట్ చేస్తున్న ఈ వీడియోను ఇప్పటికే చాలా మంది వీక్షించారు. ఒక్కోరు ఒకలా కామెంట్ చేస్తున్నారు. ఇదేం వాడకం అన్నట్టుగా సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.


ఇవీ చదవండి:

అల్‌ ఫలా వర్సిటీ క్యాంపస్‌ అటాచ్‌!

వారాణసీ స్కూళ్లలో తమిళం తరగతులు!

Updated Date - Jan 13 , 2026 | 04:05 PM