Enforcement Directorate: అల్ ఫలా వర్సిటీ క్యాంపస్ అటాచ్!
ABN , Publish Date - Jan 12 , 2026 | 07:24 AM
అల్ ఫలా యూనివర్సిటీ ఆస్తులను అటాచ్ చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు కేసులో అల్ ఫలా విద్యా సంస్థల చైర్మన్...
న్యూఢిల్లీ, జనవరి 11: అల్ ఫలా యూనివర్సిటీ ఆస్తులను అటాచ్ చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు కేసులో అల్ ఫలా విద్యా సంస్థల చైర్మన్ జావెద్ అహ్మద్ సిద్దికీని గత నవంబరులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఉన్న వర్సిటీ భవనాలను కూడా అక్రమ మార్గాల ద్వారా వచ్చిన సొమ్ముతోనే నిర్మించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అల్ ఫలా ట్రస్ట్‌కు చెందిన స్థిర, చరాస్తుల విలువలను మదింపు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే వర్సిటీ ఆస్తులను అటాచ్ చేస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.