UP Government: వారాణసీ స్కూళ్లలో తమిళం తరగతులు!
ABN , Publish Date - Jan 12 , 2026 | 07:18 AM
వారాణసీలోని పాఠశాలలు, కాలేజీల్లో తమిళం తరగతులను ప్రవేశపెట్టే యోచనలో యూపీ ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
వారాణసీ, జనవరి 11: వారాణసీలోని పాఠశాలలు, కాలేజీల్లో తమిళం తరగతులను ప్రవేశపెట్టే యోచనలో యూపీ ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. సాంస్కృతిక, భాషా సమైక్యతను పెంపొందించే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమం ప్రధాని మోదీ ‘కాశీ-తమిళ్ సంగమం’ విజన్‌కు అనుగుణంగా ఉండనుంది. ప్రభుత్వ క్వీన్స్ కళాశాల.. రోజూ సాయంత్రం తమిళ తరగతులను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. క్లాసులు నిర్వహించాలని జిల్లా పాఠశాలల ఇన్‌స్పెక్టర్ ఆదేశించారని కాలేజీ ప్రిన్సిపాల్ సుమిత్ కుమార్ తెలిపారు. అలాగే వారాణసీ నుంచి దాదాపు 50 మంది టీచర్లను హిందీ బోధించేందుకు తమిళనాడుకు పంపే అవకాశం ఉందన్నారు.