Share News

చూశారా? ఇలా మెట్లు ఎక్కి.. అలా గిన్నిస్ బుక్‌లో చోటు కొట్టేశాడు.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 06 , 2026 | 04:45 PM

సహజత్వానికి భిన్నంగా చేసిన పనులే అందరిని ఆకర్షిస్తాయి. అలాంటి వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఆయా వీడియోలకు నెటిజన్లు ఫిదా అవుతారు.

చూశారా? ఇలా మెట్లు ఎక్కి.. అలా గిన్నిస్ బుక్‌లో చోటు కొట్టేశాడు.. వీడియో వైరల్
Chinese man Li Qingbo

ఇంటర్నెట్ డెస్క్: సహజత్వానికి భిన్నంగా చేసిన పనులే అందరిని ఆకర్షిస్తాయి. అలాంటి వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఆయా వీడియోలకు నెటిజన్లు ఫిదా అవుతారు. అసలు విషయానికి వస్తే.. మేడ మెట్లు ఎవరైనా కాళ్లతో ఎక్కుతారు. వృద్ధులు అయితే గోడనో.. మరొకరి సహాయంతో ఎక్కుతారు. కానీ తలతో మెట్లు ఎవరైనా ఎక్కుతారా? అంటే లేదనే అంటారు. కానీ చైనాకు చెందిన లీ క్వింగ్‌బో.. తలను ఉపయోగించి మెట్లు ఎక్కాడు. అది కూడా ఒకటి రెండు కాదు.. ఏకంగా 40 మెట్లు ఎక్కాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కాళ్లు, చేతులను అతడు ఎక్కడా ఉపయోగించ లేదు.


కేవలం తలతోనే అన్ని మెట్లు సునాయాసంగా అతడు ఎక్కేశాడు. ఈ సమయంలో శరీరం మొత్తం అతడి తలపైనే ఆధారపడి ఉంది. దీంతో లీ క్వింగ్‌బో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. దీంతో ఈ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారు అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే లక్షలాది మంది దీనిని వీక్షించారు. లీ క్వింగ్‌బో వీడియోను లైక్ చేసి షేర్ చేశారు. అతడి అసాధారణ ప్రతిభను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అతడి కృషి, సాధన, పట్టుదలను వారంతా ప్రశంసిస్తున్నారు.


ఈ సందర్భంగా నెటిజన్లు స్పందించారు. అతడు మనిషిలా కాకుండా యంత్రంలా కనిపిస్తున్నాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంత అద్భుతమైన సమతుల్యత అతడికి ఎలా సాధ్యమైందని మరో నెటిజన్ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. దీర్ఘకాలంగా చేసిన సాధన, దృఢమైన శరీరం, అపారమైన ఆత్మవిశ్వాసం ఉంటేనే ఇటువంటి రికార్డులు సాధించగలమని మరికొందరు వ్యాఖ్యానించారు. తలతో మెట్లు ఎక్కాలని అతడికి ఎలా ఆలోచన వచ్చిందని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నడి రోడ్డుపై నటుడు పడవ ప్రయాణం.. వీడియో వైరల్

పొలంలో బాలికల డ్యాన్స్.. నెటిజన్ల హృదయాలను దోచుకున్న వీడియో వైరల్

For More Viral News And Telugu News

Updated Date - Jul 06 , 2026 | 05:37 PM