Share News

స్టంట్ మధ్యలో ఊడిపోయిన బైక్ హ్యాండిల్.. తర్వాత ఏం జరిగిందంటే?

ABN , Publish Date - Jul 22 , 2026 | 03:27 PM

సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో చేసే ప్రమాదకరమైన బైక్ స్టంట్లు కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలకు దారి తీస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ షాకింగ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీలీ స్టంట్ చేయబోయిన ఓ యువకుడికి ఊహించని షాక్ తగలడంతో, క్షణాల్లో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

స్టంట్ మధ్యలో ఊడిపోయిన బైక్ హ్యాండిల్.. తర్వాత ఏం జరిగిందంటే?
Bike Stunt Viral Video

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో రోజూ వేల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని సరదాగా నవ్వులు పంచుతుంటే, మరికొన్ని ప్రమాదకర సంఘటనలను చూపిస్తూ అందరినీ షాక్‌కు గురిచేస్తాయి. ముఖ్యంగా యువత చేసే బైక్ స్టంట్లకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. కొంతమంది లైకులు, వ్యూస్ కోసం ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తుంటారు. అలాంటి స్టంట్లు చాలాసార్లు ఘోర ప్రమాదాలకు దారి తీస్తున్నప్పటికీ.. కొందరు మాత్రం వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు.


ఈ స్టంట్ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఓ యువకుడు బైక్ నడుపుతుండగా, అతడి వెనుక మరో యువకుడు కూర్చున్నాడు. రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా బైక్ రైడర్ స్టంట్ చేయబోతూ.. ముందు చక్రాన్ని గాల్లోకి లేపేందుకు హ్యాండిల్‌ను బలంగా పైకి లాగుతాడు. అదే సమయంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. బైక్ ముందు భాగం పైకి లేవాల్సిన సమయంలో హ్యాండిల్ మాత్రమే అతడి చేతిలోకి వచ్చేస్తుంది. దీంతో ముందు చక్రం, బైక్ భాగాలు ఒక్కసారిగా విడిపోయి బైక్ అదుపు తప్పింది. ఇంతలో ఆ ఇద్దరూ పడిపోయారు. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. ఇలాంటి స్టంట్స్ చేసే సమయంలో బైక్ కండీషన్ ఎలా ఉందో చూసుకోకుండా చేస్తే ఇలాగే ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

భూకబ్జాలో సూత్రధారి సీతారాం.. పాత్రధారి ఆయన కుమారుడు: ఎమ్మెల్యే కూన రవికుమార్

ఏపీకి మరో అంతర్జాతీయ పెట్టుబడి.. యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 22 , 2026 | 05:21 PM