డెలివరీ పేరుతో ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మహిళ
ABN , Publish Date - Jul 19 , 2026 | 06:25 PM
డెలివరీ చేస్తున్న సమయంలో ఓ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడికి ఆమె గట్టి షాక్ ఇచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: డెలివరీ చేస్తున్న సమయంలో ఓ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడికి ఆమె గట్టి షాక్ ఇచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ.. ఓ డెలివరీ ఎగ్జిక్యూటివ్.. బాలికకు ఆర్డర్ ఇచ్చేందుకు వచ్చాడు. డెలివరీ చేసే క్రమంలో ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అతను ఇంట్లోకి అడుగుపెట్టబోతున్న సమయంలో బాలిక తల్లి అప్రమత్తంగా స్పందించి వెంటనే బయటే ఉండాలని హెచ్చరించింది. అనుమతి లేకుండా ఇంట్లోకి ఎలా వస్తావని ప్రశ్నించింది. డెలివరీ ఎగ్జిక్యూటివ్ తన వెర్షన్ చెప్పే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.
ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో, అప్రమత్తంగా వ్యవహరించిన బాలిక తల్లిని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా మైనర్లు మాత్రమే ఇంట్లో ఉన్న సమయంలో డెలివరీలు స్వీకరించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమతి లేకుండా ఎవరినీ ఇంట్లోకి అనుమతించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి:
జమ్మూకశ్మీర్‌లో ఆకస్మిక వరదలు.. 11 మంది మృతి
'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం