Share News

చిరుతకే షాక్.. ఈ కుక్క చేసిన పని చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Jul 21 , 2026 | 07:45 PM

ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా పులి, కుక్క వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. నిద్రిస్తున్న కుక్కపై చిరుత దాడి చేయడం.. ఆ దాడి నుంచి కుక్క తప్పించుకున్న తీరు ప్రస్తుతం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది..

చిరుతకే షాక్.. ఈ కుక్క చేసిన పని చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Leopard Attack Video

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. నిద్రిస్తున్న కుక్కపై చిరుత దాడి చేయడం.. ఆ దాడి నుంచి కుక్క తప్పించుకున్న తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిద్రిస్తున్న కుక్కపై చిరుత దాడి చేయడం.. ఆ దాడి నుంచి కుక్క తప్పించుకున్న తీరు అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. సాధారణంగా అడవుల్లో లేదా అటవీ ప్రాంతాలకు సమీపంలో చిరుతల సంచారం కనిపిస్తుంటుంది. అయితే ఈసారి ఓ చిరుత నేరుగా రోడ్డుపైకి వచ్చి నిద్రిస్తున్న కుక్కపై దాడి చేసిన ఘటన కెమెరాలో రికార్డైంది. ఈ 32 సెకన్ల వీడియోను చూసిన నెటిజన్లు చిరుత వేగం, కుక్క అప్రమత్తతపై చర్చిస్తున్నారు.


ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ.. జనసంచారం లేని ఓ రోడ్డుపై ఓ కుక్క ప్రశాంతంగా నిద్రిస్తోంది. అదే సమయంలో ఓ చిరుత ఎలాంటి శబ్దం చేయకుండా నెమ్మదిగా కుక్క వైపు అడుగులు వేస్తూ వచ్చింది. ఏమాత్రం అనుమానం రాకుండా దగ్గరకు చేరుకున్న చిరుత.. ఒక్కసారిగా కుక్కపై దూకి దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. చిరుత దాడి చేసిన వెంటనే కుక్క ఒక్కసారిగా అలెర్ట్ అయింది. వెంటనే వెనక్కి జరిగి.. క్షణాల్లో అక్కడి నుంచి పరుగెత్తి తప్పించుకుంటుంది. కుక్క వేగంగా స్పందించడంతో చిరుత కూడా ఉలిక్కిపడి అక్కడి నుంచి పారిపోయింది. చిరుత దాడి చేయడానికి ప్రయత్నించిన తీరు, కుక్క తప్పించుకున్న విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి..

భూకబ్జాలో సూత్రధారి సీతారాం.. పాత్రధారి ఆయన కుమారుడు: ఎమ్మెల్యే కూన రవికుమార్

ఏపీకి మరో అంతర్జాతీయ పెట్టుబడి.. యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 21 , 2026 | 09:55 PM