Share News

వారెవ్వా.. కూరగాయలు అమ్ముతూ AIతో నెలకు లక్ష ఆదాయం!

ABN , Publish Date - May 21 , 2026 | 01:06 PM

బెంగళూరులో ఓ కూరగాయల వ్యాపారి తలకు ఏఐ డేటా సేకరణ పరికరం ధరించి కూరగాయలు అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పని ద్వారా అతను గంటకు రూ.350 వరకు సంపాదిస్తున్నాడనే సమాచారం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వారెవ్వా.. కూరగాయలు అమ్ముతూ AIతో నెలకు లక్ష ఆదాయం!
Bengaluru Street Vendor Viral Video

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో ఓ కూరగాయల వ్యాపారి ఏఐ టెక్నాలజీ సహాయంతో అదనపు ఆదాయం సంపాదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తలకు ప్రత్యేకమైన ఏఐ డేటా సేకరణ పరికరం ధరించి కూరగాయలు అమ్ముతున్న ఈ వ్యాపారి ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.


వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, ఆ వ్యాపారి తలకు కెమెరా, మైక్రోఫోన్ ఉన్న ప్రత్యేక పరికరం పెట్టుకుని చుట్టుపక్కల పరిస్థితులు, శబ్దాలు, ప్రజల కదలికలు వంటి సమాచారాన్ని ఏఐ ట్రైనింగ్ కోసం రియల్ వరల్డ్ డేటాను సేకరిస్తున్నాడు. ఈ డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్ల అభివృద్ధికి ఉపయోగిస్తారని చెబుతున్నారు. ఈ పని కోసం అతనికి గంటకు సుమారు రూ.350 వరకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.


రోజుకు 10 గంటలు పని చేస్తే రూ.3,500 వరకు, నెలకు లక్ష రూపాయలకు పైగా సంపాదించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని కొత్త టెక్నాలజీతో వచ్చిన మంచి ఆదాయ అవకాశంగా అభినందిస్తుండగా, మరికొందరు గోప్యత, భద్రత అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం, ఇది రెగ్యులర్ ఉద్యోగం కాకపోవచ్చని, మొత్తం ప్రాజెక్టులో కొద్ది గంటల పని మాత్రమే దొరికే అవకాశం ఉందని అంటున్నారు.


Also Read:

అడ్వెంచర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ టిప్స్ మీకోసం

ఏపీఎస్ఎఫ్‌టీవీటీడీసీ చైర్మన్‌‌తోపాటు సభ్యులను నియమించిన ప్రభుత్వం

For More Latest News

Updated Date - May 21 , 2026 | 01:22 PM