Share News

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ..

ABN , Publish Date - May 21 , 2026 | 11:44 AM

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. క్యూ కాంప్లెక్స్‌లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 24 నుంచి 30 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తుందని టీటీడీ అధికారులు తెలిపారు.

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ..
Tirumala Rush Today

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లు పూర్తిగా నిండిపోయాయి. ప్రస్తుతం దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 నుంచి 30 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో క్యూ లైన్లలోకి మరింత మంది భక్తులను అనుమతించడం తాత్కాలికంగా నిలిపివేశారు.


భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు భక్తులను వెనక్కి పంపిస్తున్నారు. అలాగే రేపు ఉదయం 9 గంటల తర్వాత మాత్రమే క్యూ లైన్ల వద్దకు రావాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల సంఖ్య భారీగా పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

మదీనా చౌరస్తాలోని వస్త్ర దుకాణాల్లో అగ్ని ప్రమాదం..

నిప్పుల కొలిమి..

Read Latest AP News

Updated Date - May 21 , 2026 | 11:52 AM