Share News

భలే వ్యాపారం.. ఇరుగుపొరుగుల గాసిప్‌లను అమ్మి ఇళ్లు కొన్న బామ్మ

ABN , Publish Date - Sep 07 , 2026 | 07:54 PM

ఈ బామ్మ ఇడ్లీలు అమ్మినట్టుగా ఇరుగుపొరుగుల రహస్యాలు అమ్మెస్తోంది. వాటితో డబ్బులు దండిగా సంపాదించేస్తోంది.

భలే వ్యాపారం.. ఇరుగుపొరుగుల గాసిప్‌లను అమ్మి ఇళ్లు కొన్న బామ్మ
gossip business

ఇంటర్నెట్ డెస్క్: చాలా మందికి ఒకరి గురించి గాసిప్స్ వినడమంటే భలే ఇష్టంగా ఉంటుంది. ఇలాంటివి గంటలు తరబడి చెప్పినా ఆలకించి వింటారు. మనుషులకున్న ఇదే బలహీనతను తన వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టుకుంది ఓ బామ్మ. తమ ఊరిలో గాసిప్స్‌ను ఇడ్లీలు అమ్మినట్టుగా అమ్మెస్తోందామె. ఈ కొత్తరకం వ్యాపారంతో రెండు ఇళ్లు కూడా కొన్నానని బామ్మ గర్వంగా చెబుతోంది.


కొలంబియాకు చెందిన మిరియం అనే 67 ఏళ్ల బామ్మ రోజూ పక్కింటి వాళ్లు మాట్లాడుకునే మాటలు వినేది. వాళ్ల గొడవలు, అఫైర్లు అన్నీ నిత్యం తెలుసుకునేది. ఓ రోజు మిరియంకు ఒక ఆలోచన తట్టింది. ఈ గాసిప్‌లను అమ్మితే బోల్డు డబ్బులు పోగేసుకోవచ్చు అని ఆమె భావించింది. ఇంకేముంది పొద్దుపొద్దున్నే ఒక బుక్కు, పెన్ను పట్టుకుని వీధిలోకి వచ్చి నిలబడింది. ఇరుగుపొరుగు చెప్పుకునేవి అన్నీ తాటికాయంత అక్షరాలతో రాసుకుంది. ఆ సమాచారమంతా తరువాత విక్రయించింది. అలా ఆమె వ్యాపారం రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. గాసిప్‌ స్థాయిని బట్టి మిరియం దాని ధర నిర్ణయించేది. పెద్ద గాసిప్ అయితే ఎక్కువ ధర, చిన్నదయితే తక్కువ ధర. ఒకవేళ ఆ గాసిప్ మరీ పెద్దదయితే ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే రేటు ఇంకోలా ఉండేది. ఒక అఫైర్ బయటపెట్టకుండా ఉండేందుకు ఆమె ఓ వ్యక్తి నుంచి 7 లక్షల కొలంబియన్ పెసోలు ( దాదాపు 21 వేల రూపాయలు) తీసుకుందట.

తను సేకరించిన రహస్యల వివరాలన్నీ తన దగ్గర ఉంటాయని మిరియం చెబుతోంది. ఆఖరికి రహస్యాలకు సంబంధించిన ఫొటోలను కూడా ఉన్నాయని ఆమె అంటోంది. తెలిసిన రహస్యాన్ని ధ్రువీకరించుకున్నాకే తాను విక్రయిస్తానని హామీ కూడా ఇస్తోంది. ఇప్పటి వరకు ఈ వ్యాపారం ద్వారా రెండు ఇళ్లు కూడా కొన్నానని ఆమె చెప్పడం మరో విశేషం.


ఇవి కూడా చదవండి:

20 ఏళ్ల కార్పొరేట్ జీవితంలో పది క్రేజీ థింగ్స్.. వీడియో వైరల్

ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్.. డెలివరీ లేటైందని వెళ్లి చూస్తే..

Updated Date - Sep 07 , 2026 | 09:41 PM