మరికొన్ని గంటల్లో వర్షాలు.. ఏపీలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్!
ABN , Publish Date - Sep 07 , 2026 | 06:53 PM
ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందనే అంచనాతో ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
అమరావతి, సెప్టెంబర్ 07: ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ క్రమంలో గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరికొన్ని గంటల్లో ఆయా జిల్లాల్లోని గురజాల, మాచర్ల, దర్శి, కందుకూరు, ఒంగోలు, బాపట్ల, గుంటూరు, పిడుగురాళ్ల, నరసరావుపేట, చిలకులూరిపేట పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వర్షం కురిసే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు, రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని సూచించింది. మరోవైపు ఏపీపై ఎల్‌నినో ప్రభావం పెరుగుతోందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేసవి తరహాలో పగటి పూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి.
ఇవి కూడా చదవండి:
భవనం కూలిన ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం
రష్యాలో ఓ భార్య ఆవేదన.. స్పందించిన భారత ఎంబసీ