రక్షణ ఉత్పత్తుల రంగంలో హైదరాబాద్ సరికొత్త చరిత్ర
ABN , Publish Date - Sep 07 , 2026 | 06:50 PM
ఏరోస్పేస్, రక్షణ రంగ తయారీ హబ్‌గా గ్లోబల్ మ్యాప్‌లో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. 'టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్'ప్లాంట్ ప్రపంచ స్థాయి మైలురాయిని అధిగమించింది.
హైదరాబాద్ / ఢిల్లీ, సెప్టెంబర్ 7: ఏరోస్పేస్, రక్షణ రంగ తయారీ హబ్‌గా గ్లోబల్ మ్యాప్‌లో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. హైదరాబాద్‌లోని 'టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్' (TBAL) ప్లాంట్ ప్రపంచ స్థాయి మైలురాయిని అధిగమిస్తూ, విజయవంతంగా పూర్తి చేసిన 400వ 'AH-64E అపాచీ' (Apache) అటాక్ హెలికాప్టర్ ఫ్యూజ్‌లేజ్‌ను (హెలికాప్టర్ ప్రధాన బాడీ భాగం) ఆవిష్కరించింది. ఈ ఘనతతో రక్షణ రంగ విడిభాగాల తయారీలో హైదరాబాద్ మకుటంలో మరో మెరిసే మైలురాయి చేరింది.
గ్లోబల్ సప్లై చైన్‌కు హైదరాబాద్ కేంద్రం
జాయింట్ వెంచర్: అమెరికాకు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ దిగ్గజం 'బోయింగ్', భారతీయ 'టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్' కలయికలో జాయింట్ వెంచర్‌గా ఏర్పాటైన ఈ ప్లాంట్, అంతర్జాతీయ ప్రమాణాలతో రక్షణ ఉత్పత్తులను తయారు చేస్తోంది.
ప్రపంచ వ్యాప్త సరఫరా: హైదరాబాద్ ప్లాంట్ నుంచి తయారైన ఈ ఫ్యూజ్‌లేజ్‌లు కేవలం భారతదేశానికే కాకుండా అమెరికా ఆర్మీ (US Army) సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల సైన్యాలకు ఎగుమతి అవుతున్నాయి.
భారత సైన్యానికి కొండంత అండ: భారత వైమానిక దళం (IAF) వినియోగిస్తున్న 22 అపాచీ హెలికాప్టర్లతో పాటు, ఇండియన్ ఆర్మీ ఆధీనంలో ఉన్న 6 అపాచీ హెలికాప్టర్లకు హైదరాబాద్‌లో తయారైన విడిభాగాలే ప్రధాన ఆధారం కావడం గమనార్హం.
ఇవి కూడా చదవండి...
LP మీటింగ్ కూడా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోనే చేస్తారా: మంత్రి సీతక్క
రాంచందర్‌రావు అరెస్ట్.. తోపులాట.. ఉద్రిక్తత