మూకుమ్మడిగా ఫోన్లు పగులగొట్టిన నేరస్థులు.. కారణమేంటో తెలిస్తే..
ABN , Publish Date - Jun 19 , 2026 | 07:41 AM
హర్యానాలోని నుహ్ జిల్లా నగిన పోలీస్ స్టేషన్ పరిధిలోని సుఖ్‌పురి గ్రామంలో ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. నేరస్థులంతా మూకుమ్మడిగా తమ ఫోన్లను పగులగొట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది..
ఇంటర్నెట్ డెస్క్: హర్యానాలోని నుహ్ జిల్లా నగిన పోలీస్ స్టేషన్ పరిధిలోని సుఖ్‌పురి గ్రామంలో ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. కొంతమంది యువకులు బహిరంగంగా మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారు. వారంతా గతంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు ఉపయోగించిన ఈ ఫోన్లను గ్రామస్తుల ఎదుటే పగలగొట్టి, నేరాలను, వ్యసనాలను శాశ్వతంగా విడిచిపెడతామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా నూహ్ పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్పిత్ జైన్ మాట్లాడుతూ.. ‘ఇటీవల ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమంతో.. గతంలో నేరాలకు పాల్పడిన కొందరు యువకుల్లో పరివర్తన వచ్చింది. ఇకపై నిజాయితీగా తమ జీవనోపాధిని కొనసాగిస్తామని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తాము సమాజ శ్రేయస్సుకు తోడ్పడతామని ప్రమాణం చేశారు. గతంలో తాము నేరాలకు పాల్పడిన సమయంలో వాడిన మొబైల్స్ అందరి సమక్షంలో ధ్వంసం చేశారు. ఇది గొప్ప శుభపరిణామం’ అని అన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ ఖట్కడ్, నగిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ సచిన్ కుమార్ స్వయంగా హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
బీచ్ ఒడ్డున జాగ్రత్తగా ఉండకపోతే ఇంతే.. ప్రమాదం ఎలా ముంచుకొచ్చిందో చూడండి..
బామ్మ నిర్లక్ష్యం.. సైక్లిస్టుల ప్రాణాల మీదకు వచ్చిందిగా... వీడియో వైరల్