స్నేక్ వర్సెస్ మ్యాన్.. ఇలాంటి ఫైట్ ఎప్పుడూ చూసిండరు..!
ABN , Publish Date - Jun 18 , 2026 | 04:03 PM
సాధారణంగా మనుషులకు పాములంటే చాలా భయం ఉంటుంది. వాటిని చూస్తేనే చాలా మంది వణికిపోతుంటారు. అవి కళ్ల ముందు ప్రత్యక్షమైతే ఇక అంతే సంగతులు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అక్కడి నుంచి లగెత్తుతారు.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా మనుషులకు పాములంటే చాలా భయం ఉంటుంది. వాటిని చూస్తేనే చాలా మంది వణికిపోతుంటారు. అవి కళ్ల ముందు ప్రత్యక్షమైతే ఇక అంతే సంగతులు.. ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అక్కడి నుంచి లగెత్తుతారు. అలాంటిది.. పాముతో ఓ వ్యక్తి ఫైట్ చేసి ఔరా అనిపించాడు. ఏమాత్రం భయపడకుండా సర్పానికి చుక్కలు చూపించాడు. ఈ ఫైట్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
@Tran_Thai_Hoa అనే ఎక్స్ యూజర్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆ వీడియో ప్రకారం, పంట పొలంలో ఓ వ్యక్తి పాముతో ఫైట్ చేస్తూ కనిపించాడు. తలకు టోపీ, కాళ్లకు బూట్లు ధరించిన అతను పాముపై యుద్ధం ప్రకటించినట్లు ఘర్షణకు దిగాడు. సర్పాన్ని కాళ్లతో తంతూ పదేపదే దాడి చేశాడు. అయితే, పాము ఏమాత్రం భయపడకుండా అతనిపైకి దూసుకెళ్లింది. బుసలు కొడుతూ పలుమార్లు కాటేయడానికి ప్రయత్నించింది. కాళ్లతో తంతున్నా లెక్కచేయకుండా తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నించింది ఆ సర్పం. సమయం చూసి పారిపోయేందుకు ప్రయత్నించినా.. అతను మాత్రం దాన్ని వదిలిపెట్టలేదు. చేతులతో పట్టుకుని మరీ వెనక్కి లాగాడు. ఈ క్రమంలో అతన్ని సర్పం కాటేసినట్లు వీడియోలో కనిపించింది.
అయినా అతను లెక్క చేయకుండా మళ్లీ పాముపై దాడికి దిగాడు. చివరిసారిగా గట్టిగా తన్నడంతో గాల్లో పాము పల్టీలు కొడుతూ బురదలో పడిపోయింది. దీంతో వీడియో ముగిసిపోయింది. అయితే, పాము కాటేయడం వల్ల అతనికి ఏమైనా అయ్యిందా, లేదా? అనే దానిపై స్పష్టత లేదు. కాగా, ఈ వీడియోను 2.9 మిలియన్ల మంది వీక్షించగా.. అతని సాహసానికి, పాము ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
బీచ్ ఒడ్డున జాగ్రత్తగా ఉండకపోతే ఇంతే.. ప్రమాదం ఎలా ముంచుకొచ్చిందో చూడండి..
బామ్మ నిర్లక్ష్యం.. సైక్లిస్టుల ప్రాణాల మీదకు వచ్చిందిగా... వీడియో వైరల్