Share News

ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వీధికుక్క.. జనం నీరాజనం..

ABN , Publish Date - Jun 18 , 2026 | 10:11 AM

ఓ వీధికుక్క సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. శాంతిదూతగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ‘పీస్ డాగ్ అలోకా’గా జన నీరాజనం అందుకుంటోంది.

ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వీధికుక్క.. జనం నీరాజనం..
Peace Dog Aloka

ఇంటర్‌నెట్ డెస్క్: ఓ వీధికుక్క సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. శాంతిదూతగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ‘పీస్ డాగ్ అలోకా’గా జన నీరాజనం అందుకుంటోంది. తినడానికి సరైన తిండి దొరక్క ఇబ్బంది పడుతున్న స్థాయి నుంచి జనం దాన్ని తాకితే చాలు అనుకునే స్థాయి వరకు సాగిన ఆ వీధికుక్క ప్రయాణం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే.. అలోకా 2022లో తినడానికి తిండి దొరక్క అల్లాడిపోయేది. వీధులు పట్టుకుని తిరిగేది. ఇలాంటి సమయంలో ఇండియాలో శాంతి యాత్ర చేస్తున్న ప్రముఖ బౌద్ధ భిక్షువు భిఖు పన్నకార నేతృత్వంలోని బౌద్ధ భిక్షకుల సమూహం అలోకాను ఆదరించి తిండి పెట్టింది.


తిండి తిన్న తర్వాత అది అక్కడినుంచి వెళ్లిపోలేదు. వారితో పాటే తిరగటం మొదలెట్టింది. బౌద్ధ భిక్షకుల సమూహం కాలి నడకన భారత్‌తో పాటు నేపాల్‌లోని పుణ్య క్షేత్రాలు తిరిగింది. అలోకా వారితో పాటు 100 రోజులు.. 2300 మైళ్లు శాంతి యాత్ర చేసింది. 100 రోజుల పర్యటన తర్వాత భిఖు పన్నకార దానికి అలోకా అని పేరు పెట్టారు. తనతో పాటు అమెరికాలోని టెక్సాస్ ఆశ్రమానికి తీసుకెళ్లారు. అప్పటినుంచి దాని జీవితం పూర్తిగా మారిపోయింది. పీస్ డాగ్‌గా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో సైతం సంచలనం సృష్టిస్తోంది.


ఇన్‌స్టాగ్రామ్‌లో అలోకా ది పీస్ డాగ్ అకౌంట్‌కు 4 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అలోకా ఎక్కడికి వెళ్లినా జనం దాన్ని చూడ్డానికి, తాకడానికి, దండం పెట్టడానికి.. ఫొటోలు, వీడియోలు, సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడుతున్నారు. జూన్ 16వ తేదీన ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి అలోకా కూడా వచ్చింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న జనం అలోకాను తాకి, దండం పెట్టుకోవడానికి క్యూకట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

రష్యా విమానం గల్లంతు అంటూ వార్తలు.. కాసేపటికి సేఫ్ ల్యాండింగ్

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి

Updated Date - Jun 18 , 2026 | 11:49 AM