Share News

రష్యా విమానం గల్లంతు అంటూ వార్తలు.. కాసేపటికి సేఫ్ ల్యాండింగ్

ABN , Publish Date - Jun 18 , 2026 | 10:01 AM

సోచి (రష్యా) నుంచి బుధవారం టేకాఫ్ అయ్యాక కనిపించకుండా పోయిన ఒక విమానం ఆ తరువాత సేఫ్‌గా ల్యాండైంది. దీంతో, రష్యా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

రష్యా విమానం గల్లంతు అంటూ వార్తలు.. కాసేపటికి సేఫ్ ల్యాండింగ్
Smartavia Flight

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ రష్యాలోని సోచి నగరం నుంచి బుధవారం బయలుదేరిన ఒక ప్యాసింజర్ విమానం కనిపించకుండా పోవడంతో కలకలం రేగింది. కొన్ని గంటల తరువాత విమానం సేఫ్‌గా సోచిలోనే ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు. స్మార్టావియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-800 విమానం బుధవారం సాయంత్రం సోచి నుంచి 125 మంది ప్రయాణికులతో అర్ఖంగేల్స్క్‌కు బయలుదేరింది. ఆ తరువాత కాసేపటికి రాడార్‌కు విమానం సిగల్స్ అందకుండా పోవడంతో కలకలం రేగింది. అప్పటికే విమానం ఎమర్జెన్సీలో ఉందన్న సందేశాలు అందినట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. దీంతో, రష్యాలో ఒక్కసారిగా కలకలం రేగింది.


ఆ తరువాత మళ్లీ రాడార్‌కు సిగ్నల్స్ అందడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత కాసేపటికి సోచికి తిరిగొచ్చిన విమానం సేఫ్‌గా ల్యాండైంది. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రష్యన్ మీడియా తెలిపింది. ఇతర విమానాల్లో ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు వెళ్లారని తెలిపింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. విమానం బయలుదేరాక సాంకేతిక లోపం తలెత్తి ఉండవచ్చన్న ప్రాథమిక అంచనాకు వచ్చారు.


ఈ వార్తలనూ చదవండి:

స్కూల్‌పై దాడి.. ఎవరూ కావాలని చేయలేదు: ట్రంప్

శాంతి ఒప్పందంపై సంతకం చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..

Updated Date - Jun 18 , 2026 | 11:37 AM