Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Feb 28 , 2026 | 06:47 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Breaking News

Live News & Updates

  • Feb 28, 2026 08:26 IST

    హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఫేక్ బంగారంతో మోసం

    • నకిలీ గోల్డ్ బిస్కెట్లు ఇచ్చి కిలో బంగారు నగలతో పరారీ

    • ఓ ప్రముకురాలి పీఏ అంటూ నగల వ్యాపారితో పరిచయం

    • బంగారు బిస్కెట్లు ఇచ్చి నగల మార్పిడికి ఒప్పందం

  • Feb 28, 2026 08:24 IST

    నేడు రాజస్థాన్‌లో ప్రధాని మోదీ పర్యటన

    • అజ్మీర్‌లో HPV టీకాల కార్యక్రమం ప్రారంభించనున్న ప్రధాని

    • రాజస్థాన్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులు, శంకుస్థాపనలు చేయనున్న ప్రధాని

  • Feb 28, 2026 08:20 IST

    రాజస్థాన్‌లోని బలోత్రాలో తీవ్ర విషాదం..

    • బస్సు-ట్రక్కు ఢీకొని ఆరుగురి మృతి

    • ప్రైవేట్ స్లీపర్ బస్సు, ట్రక్కును బలంగా ఢీకొని ప్రమాదం

    • ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురికి గాయాలు

  • Feb 28, 2026 08:19 IST

    టీ-20 ప్రపంచ కప్-2026: రింకు సింగ్ సంచలన నిర్ణయం!

    • తండ్రి మరణంతో స్వస్థలం అలీఘర్‌కు వెళ్లిన రింకు

    • కీలక మ్యాచ్‌కు ముందే తిరిగి జట్టులోకి రావాలని రింకు నిర్ణయం

    • మార్చి1న భారత్, వెస్టిండీస్ మధ్య కీలక మ్యాచ్

    పూర్తి కథనం

  • Feb 28, 2026 07:58 IST

    ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్‌‌‌తో లావాదేవీలు బంద్.. ట్రంప్ ఆదేశాలు

    • ఏఐ సేఫ్టీ రూల్స్‌ను ఆంథ్రోపిక్ పూర్తిగా సడలించకపోవడంతో మొదలైన వివాదం

    • సంస్థ ఏఐ సాంకేతికతను వినియోగించొద్దంటూ ప్రభుత్వ విభాగాలకు ట్రంప్ ఆదేశాలు

    • అమెరికా ప్రభుత్వానికి ఈ సాంకేతికత అవసరం లేదని కామెంట్

    • భవిష్యత్తులో ఆంథ్రోపిక్‌తో ఎలాంటి వ్యాపార లావాదేవీలు ఉండవని స్పష్టీకరణ

  • Feb 28, 2026 07:50 IST

    తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించి రీల్స్‌

    • శ్రీవారి ఆలయం దగ్గర రీల్స్ చేసిన గీతూ రాయల్ అండ్ టీం

    • ఘాట్ రోడ్డుతోపాటు శ్రీవారి ఆలయం దగ్గర ఓ పాటకు గీతూ రాయల్ డ్యాన్స్‌

    • రీల్‌ని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన గీతూ రాయల్

  • Feb 28, 2026 07:05 IST

    సీఎం వరుస సమీక్షలు

    • హైదరాబాద్‌: సీఎం రేవంత్‌ రెడ్డి వరుస సమీక్షలు

    • నేడు రూరల్‌ డెవలప్‌మెంట్‌పై సీఎం రేవంత్‌ సమీక్ష

  • Feb 28, 2026 07:05 IST

    నేడు విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

    • చీపురుపల్లి నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు హాజరు

    • రావివలసలో పంచాయతీ పరిధిలో పెన్షన్లు పంపిణీ

    • చీపురుపల్లిలో HPV వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్న సీఎం

  • Feb 28, 2026 07:03 IST

    ఏపీ కొత్త సీఎస్‌గా నేడు సాయిప్రసాద్‌కు బాధ్యతలు

    • ఉ.11:33కు స్పెషల్ సీఎస్‌‌గా సాయిప్రసాద్‌ బాధ్యతలు స్వీకరణ

  • Feb 28, 2026 07:02 IST

    నేడే సీజేఐ పర్యటన..

    • నేడు తిరుపతిలో CJI జస్టిస్ సూర్యకాంత్‌ పర్యటన

    • మార్చి ఒకటిన దామినేడు దగ్గర నూతన జిల్లా కోర్టు భవన నిర్మాణానికి భూమి పూజ

  • Feb 28, 2026 07:01 IST

    హైదరాబాద్‌: నేడు కడియం శ్రీహరి కేసు విచారణ

    • అనర్హత వేటు పిటిషన్‌ దాఖలు చేసిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్

    • ఉ.11 గంటలకు కడియంను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న లాయర్లు

  • Feb 28, 2026 06:49 IST

    విమాన ప్రమాదం.. 15మంది మృతి

    • బొలీవియాలో ఘోర విమాన ప్రమాదం

    • కరెన్సీ నోట్లను తరలిస్తుండగా కూలిన వైమానిక దళ విమానం

    • లా పాజ్ సమీపంలో ఘటన.. చెల్లా చెదురైన కరెన్సీ

    • 15 మంది మరణించగా, మరో 30మందికి గాయాలు

    పూర్తి కథనం

  • Feb 28, 2026 06:47 IST

    స్థిరంగా పసిడి ధరలు

    • రెండు, మూడ్రోజులుగా భారత్‌లో స్థిరంగా గోల్డ్, సిల్వర్ రేట్స్

    • హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,580

    • 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,48,110

    • కిలో వెండి ధర రూ.2,94,900

    పూర్తి కథనం