కొత్త నోట్లను తరలిస్తుండగా కూలిన విమానం.. 15 మంది దుర్మరణం.
ABN , Publish Date - Feb 28 , 2026 | 07:03 AM
బొలీవియా రాజధాని లా పాజ్ సమీపంలో ఎల్ ఆల్టో నగరంలో శుక్రవారం తీవ్ర విషాదం నెలకొంది. బొలీవియన్ వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: బొలీవియా(Bolivia) రాజధాని లా పాజ్(La Paz) సమీపంలో ఎల్ ఆల్టో(El Alto) నగరంలో శుక్రవారం తీవ్ర విషాదం నెలకొంది. బొలీవియన్ వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ విమానం(Hercules aircraft) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 15మంది మరణించగా.. 30మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. విమానం బొలీవియా సెంట్రల్ బ్యాంక్ నుంచి కొత్త నోట్లను తీసుకుని వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.
ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. విమానం జనసంచారం ఉన్న ప్రాంతంలో కూలిపోవడంతో మృతుల సంఖ్య మరితం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు జాతీయ విమానయాన సంస్థ బొలీవియా డి ఏవియాసియన్ రాయిటర్స్ నివేదించింది.
ఈ వార్తలూ చదవండి
ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ
కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ