స్థిరంగా గోల్డ్ రేట్స్! నేటి ధరలు ఇవీ
ABN , Publish Date - Feb 28 , 2026 | 06:51 AM
దేశంలో గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరి ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: గత రెండు మూడు రోజులుగా భారత్‌లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు మాత్రమే కనిపిస్తున్నాయి. గురువారం రూ.870ల మేర పెరిగిన బంగారం ధర శుక్రవారం సుమారు రూ.500ల మేర తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,580గా ఉంది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,48,110గా ఉంది. దేశంలో వెండి ధరలూ స్థిరంగానే ఉంటున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,94,900గా ఉంది (Gold, Silver Rates on Feb 28).
ప్రస్తుతం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా వాణిజ్య విధానంలో అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇన్వెస్టర్లు అనేక మంది బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారని అంటున్నారు. దీంతో, రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం (24కే, 22కే) ధరలు
చెన్నై: ₹1,62,540; ₹1,48,990
ముంబై: ₹1,61,580; ₹1,48,110
ఢిల్లీ: ₹1,61,710; ₹1,48,240
కోల్‌కతా: ₹1,61,580; ₹1,48,110
బెంగళూరు: ₹1,61,580; ₹1,48,110
హైదరాబాద్: ₹1,61,580; ₹1,48,110
విజయవాడ: ₹1,61,580; ₹1,48,110
కేరళ: ₹1,61,580; ₹1,48,110
పుణె: ₹1,61,580; ₹1,48,110
వడోదరా: ₹1,61,610; ₹1,48,140
అహ్మదాబాద్: ₹1,61,610; ₹1,48,140
వెండి (కిలో) ధరలు
చెన్నై: ₹2,94,900
ముంబై: ₹2,84,900
ఢిల్లీ: ₹2,84,900
కోల్‌కతా: ₹2,84,900
బెంగళూరు: ₹2,84,900
హైదరాబాద్: ₹2,94,900
విజయవాడ: ₹2,94,900
కేరళ: ₹2,94,900
పుణె: ₹2,84,900
వడోదరా: ₹2,84,900
అహ్మదాబాద్: ₹2,84,900
గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. బంగారం ధరలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాదు, నగరాన్ని బట్టి, మేకర్/జ్యువెలర్ ఆధారంగా కొద్దిగా తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది.
ఈ వార్తలూ చదవండి:
ప్రగతి రథం.. వృద్ధి పథం.. భారత్ వృద్ధి రేటు 7.8 శాతం