Share News

మహీంద్రా కొత్త రొటావేటర్లు

ABN , Publish Date - Feb 28 , 2026 | 02:17 AM

మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) వ్యవసాయ యంత్రాల విభాగం సరికొత్త రొటావేటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. మహావేటర్‌, మహావేటర్‌ హెచ్‌డీ సీరిస్‌ పేరుతో...

మహీంద్రా కొత్త రొటావేటర్లు

  • జహీరాబాద్‌ ప్లాంట్‌లో తయారీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) వ్యవసాయ యంత్రాల విభాగం సరికొత్త రొటావేటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. మహావేటర్‌, మహావేటర్‌ హెచ్‌డీ సీరిస్‌ పేరుతో అభివృద్ధి చేసిన ఈ సరికొత్త రొటావేటర్లను కంపెనీ తెలంగాణలోని జహీరాబాద్‌, పంజాబ్‌లోని నభా ప్లాంట్లలో తయారు చేస్తోంది. దేశంలోని అన్ని రకాల నేలల దుక్కిలో ఈ రోటావేటర్లు సమర్ధవంతంగా ఉపయోగపడతాయని తెలిపింది. ముందుగా నాలుగు నుంచి తొమ్మిది అడుగుల నిడివి విభాగంలో ఈ రొటావేటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు తెలిపింది.

4-Business.jpg

  • నిస్సాన్‌ మోటార్స్‌ ఇండియా.. మార్కెట్లోకి సరికొత్త నిస్సాన్‌ గ్రావైట్‌ను తీసుకువచ్చింది. ఈ ఏడు సీట్ల ఎంపీవీ మోడల్‌ను కంపెనీ ఏఎ్‌సఎం (సౌత్‌, సేల్స్‌) అశోక్‌ కుమార్‌ రెడ్డి విడుదల చేశారు. దీని ప్రారంభ ధర రూ.5.65 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). ఈ కార్యక్రమంలో వైబ్రెంట్‌ మొబిలిటీ గ్రూప్‌ ఎండీ సిరాజుద్దీన్‌ పాల్గొన్నారు.

ఈ వార్తలూ చదవండి

ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ

కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ

Updated Date - Feb 28 , 2026 | 02:18 AM