అద్భుత వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న భట్టి విక్రమార్క

ABN, Publish Date - Oct 18 , 2026 | 06:15 PM

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని నాచారంలో గల అద్భుత వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గుడికి వచ్చిన భట్టికి పూజారులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. బ్రాహ్మణులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్ఠత గురించి అడిగి తెలుసుకున్నారు.

అద్భుత వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న భట్టి విక్రమార్క 1/12

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని నాచారంలో గల అద్భుత వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గుడికి వచ్చిన భట్టికి పూజారులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

అద్భుత వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న భట్టి విక్రమార్క 2/12

భట్టివిక్రమార్కకు.. బ్రాహ్మణులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్ఠత గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు.

అద్భుత వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న భట్టి విక్రమార్క 3/12

ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రూ.44 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆలయ రహదారి నిర్మాణ పనులకు భట్టివిక్రమార్క శంకుస్థాపన చేశారు.

అద్భుత వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న భట్టి విక్రమార్క 4/12

ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం, రహదారి సదుపాయాలను అభివృద్ధి చేయడం ఈ పనుల ప్రధాన ఉద్దేశమని భట్టివిక్రమార్క పేర్కొన్నారు.

అద్భుత వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న భట్టి విక్రమార్క 5/12

రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం రూ.2,500 కోట్లు కేటాయించిందని భట్టి విక్రమార్క వెల్లడించారు.

అద్భుత వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న భట్టి విక్రమార్క 6/12

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు భట్టివిక్రమార్క వివరించారు.

అద్భుత వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న భట్టి విక్రమార్క 7/12

అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణం, అభివృద్ధి కోసం రూ.90 వేల కోట్లు కేటాయించినట్లు భట్టివిక్రమార్క తెలిపారు.

అద్భుత వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న భట్టి విక్రమార్క 8/12

నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే రహదారి నిర్మాణం పూర్తయితే భక్తుల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుందని భట్టివిక్రమార్క వెల్లడించారు.

అద్భుత వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న భట్టి విక్రమార్క 9/12

ఈ ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి రావడంతో పాటు స్థానిక ప్రాంత అభివృద్ధికి కూడా దోహదపడనుందని భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు.

అద్భుత వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న భట్టి విక్రమార్క 10/12

గత పాలకుల నుంచి వచ్చిన రుణాల భారం నెలకు రూ.6,600 కోట్లు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమ పథకాలను నిరంతరంగా కొనసాగిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.

అద్భుత వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న భట్టి విక్రమార్క 11/12

ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని భట్టివిక్రమార్క వివరించారు.

అద్భుత వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న భట్టి విక్రమార్క 12/12

అలాగే యంగ్ ఇండియా పాఠశాలల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.

Updated at - Oct 18 , 2026 | 07:35 PM