ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. తెలంగాణ సమస్యలపై చర్చ
ABN, Publish Date - Nov 15 , 2026 | 02:14 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం.
1/5
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం.
2/5
సీఎంతో పాటు ప్రధానిని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి కలిశారు. డిసెంబరు 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే గ్లోబల్ సమ్మిట్, అలాగే, డిసెంబరులో జరిగే ఖేలో ఇండియా క్రీడల ప్రారంభానికి ప్రధానిని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఆహ్వానించారు.
3/5
నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలతో పాటు ఎల్‌నినో ప్రభావంపై ప్రధాని నరేంద్రమోదీతో సీఎం రేవంత్‌రెడ్డి బృందం చర్చించినట్లు తెలుస్తోంది.
4/5
తెలంగాణ రాష్ట్రంలో లోటు వర్షపాతం, కరువు పరిస్థితులను ప్రధానికి వివరించి కేంద్ర సహాయాన్ని సీఎం అడిగినట్లు సమాచారం. 365 మండలాలను కరువు మండలాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
5/5
ఈ మేరకు రూ.30వేల కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి కోరినట్లు తెలుస్తోంది. అలాగే,152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర నుంచి, సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ నుంచి అనుమతులు ఇప్పించాలని సీఎం విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
Updated at - Nov 15 , 2026 | 02:16 PM