సోనియాగాంధీ ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణ.. హాజరైన ప్రముఖులు
ABN, Publish Date - Nov 17 , 2026 | 09:30 AM
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ రాసిన ఆత్మకథను ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పేరుతో సోమవారం ఢిల్లీలోని ఐటీసీ హోటల్‌లో అధికారికంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకం ఈ నెల 10వ తేదీనే మార్కెట్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రచురణ సంస్థ హార్పర్ కాలిన్స్ ఇండియా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
1/15
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ రాసిన ఆత్మకథను ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పేరుతో సోమవారం ఢిల్లీలోని ఐటీసీ హోటల్‌లో అధికారికంగా ఆవిష్కరించారు.
2/15
ఈ పుస్తకం ఈ నెల 10వ తేదీనే మార్కెట్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రచురణ సంస్థ హార్పర్ కాలిన్స్ ఇండియా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక సీఎం శివకుమార్, హిమాచల్ సీఎం సుఖ్విందర్‌సింగ్ సుఖుతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్, తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ కూడా వచ్చారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, జేఎంఎం నేత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, తమిళనాడు సీఎం విజయ్ కూడా హాజరయ్యారు.
3/15
తన కుటుంబంపై ఏళ్ల తరబడి తప్పుడు ప్రచారం జరిగిందని, చివరకు తాను మాట్లాడాలనుకున్నానని సోనియాగాంధీ పేర్కొన్నారు. అందుకే తన భావాలను పుస్తక రూపంలో తీసుకొచ్చానని చెప్పారు.
4/15
‘నా అత్తగారు ఇందిరాగాంధీ, నా భర్త, కొడుకు రాహుల్, కూతురు ప్రియాంక.. ఇలా మా కుటుంబం అందరి మీదా ఎన్నో ఏళ్లుగా తప్పుడు ప్రచారం చేశారు’ అని సోనియాగాంధీ అన్నారు.
5/15
తన మనసును గాయపరిచే మాటలను కొంతమంది అన్నారని.. తన వైపు నుంచి కథ ఏమిటో చెప్పాలంటే పుస్తకం రాయడమే సరైందని అనిపించిందని సోనియా గాంధీ తెలిపారు.
6/15
ఈ పుస్తకానికి వస్తున్న ఆదరణ ఎంతో సంతోషం కలిగించిందని సోనియాగాంధీ పేర్కొన్నారు.
7/15
తన పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక, స్నేహితురాలు మంజూలికా దూబే పట్టుబట్టడం వల్లే ఈ పుస్తకం రాశానని సోనియా గాంధీ తెలిపారు.
8/15
తనకు డైరీ రాసే అలవాటు లేదని, జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుని తన ఆత్మకథను రాశానని సోనియా గాంధీ వెల్లడించారు.
9/15
మొదట్లో ఈ పుస్తకరం రాయడం కష్టంగా అనిపించినా, ఒకసారి మొదలుపెట్టాక ఆనకట్ట తెగినట్టు జ్ఞాపకాలన్నీ బయటకు వచ్చాయని సోనియా గాంధీ వివరించారు.
10/15
తన అత్త ఇందిరాగాంధీ హత్య, భర్త రాజీవ్‌గాంధీ హత్యల గురించి రాసేటప్పుడు చాలా కష్టంగా అనిపించిందని సోనియా గాంధీ తెలిపారు.
11/15
ఇటలీ నుంచి వచ్చి భారత సంస్కృతిలో, కొత్త కుటుంబంలో కలిసిపోవడానికి తాను పడిన కష్టమే ఈ పుస్తకమని సోనియాగాంధీ పేర్కొన్నారు.
12/15
ఈ దేశంలో తనకు ఎదురైన పరిస్థితులు, అనుభవాన్ని చెప్పడానికే తన ఆత్మకథకు ‘బిలాంగింగ్’ అనే పేరు పెట్టానని సోనియా గాంధీ వివరించారు.
13/15
పెళ్లయి అత్తారింటికి చేరే చాలామంది అమ్మాయిలకు ఎదురయ్యే అనుభవమే తనకూ ఎదురైందని సోనియాగాంధీ వెల్లడించారు. అందరు కోడళ్లలాగే తానూ కొత్త వాతావరణానికి, కొత్త పద్ధతులకు అలవాటు పడ్డానని అన్నారు.
14/15
ఇందిరాగాంధీ అంటే మొదట్లో తనకు ఎంతో భయంగా ఉండేదని, ఆమెను ‘మమ్మీ’ అని పిలవడానికి కొంత సమయం పట్టిందని సోనియా గాంధీ ప్రస్తావించారు.
15/15
రాహుల్, ప్రియాంక పుట్టిన తర్వాత ఇందిర గాంధీలో ఎంతో మార్పు వచ్చిందని సోనియాగాంధీ తెలిపారు. ఆమె ఎంత బిజీగా ఉన్నా డైనింగ్ టేబుల్ దగ్గర అందరం కలుసుకుని మాట్లాడుకునే వాళ్లమని గుర్తుచేసుకున్నారు.
Updated at - Nov 17 , 2026 | 10:55 AM