విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ

ABN, Publish Date - Jan 11 , 2026 | 02:07 PM

విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలో సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని కృష్ణతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ 1/13

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సాహసాలకు మారుపేరుగా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని.. విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద ఆదివారం ఆవిష్కరించారు.

విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ 2/13

ఈ వేడుకలో సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని కృష్ణతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ 3/13

ఈ చారిత్రక ఘట్టంలో కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎంపీ కేశినేని శివనాథ్, హీరో జయ కృష్ణ, గద్దె రామ్మోహన్, బోండా ఉమా, బుద్ధ వెంకన్న ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ 4/13

తన సోదరుడి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడంపై ఆదిశేషగిరిరావు కృతజ్ఞతలు తెలిపారు.

విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ 5/13

తెలుగుజాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ సూపర్ స్టార్ కృష్ణ అని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు.

విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ 6/13

కృష్ణని చూస్తే అల్లూరి సీతారామరాజు గుర్తొస్తుంటారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ 7/13

కృష్ణా విగ్రహం భవిష్యత్ తరాలకు ఆయన కృషిని, ధైర్యాన్ని తెలియజేస్తుందని అభిమానులు అభిప్రాయపడ్డారు.

విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ 8/13

తెలుగు సినిమాకు టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత కృష్ణకే దక్కుతుందని నిర్మాత అశ్వినీదత్ కొనియాడారు.

విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ 9/13

విజయవాడ వంటి చారిత్రక నగరంలో, లెనిన్ సెంటర్ వంటి కీలక కూడలిలో కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆయన గౌరవం మరింత రెట్టింపు అయ్యిందని అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ 10/13

ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహానటుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం తెలుగు వారికి గర్వకారణమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.

విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ 11/13

సినీ వినీలాకాశంలో ధృవతార కృష్ణ సినీ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకమని, తెలుగు తెరకు మొదటి ఈస్ట్‌మన్ కలర్, సినిమాస్కోప్, 70mm సినిమాలను పరిచయం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసించారు.

విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ 12/13

జేమ్స్ బాండ్ తరహా సినిమాలు, కౌబాయ్ కథలు, పౌరాణిక, చారిత్రక చిత్రాలతో చరిత్ర సృష్టించారని మంత్రి కొల్లు రవీంద్ర కీర్తించారు.

విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ 13/13

'అల్లూరి సీతారామరాజు' వంటి చిత్రాల ద్వారా తెలుగు వారి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ధృవతార కృష్ణ అని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కొనియాడారు.

Updated at - Jan 11 , 2026 | 02:14 PM