వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ప్రత్యేక పూజలు

ABN, Publish Date - Sep 14 , 2026 | 02:13 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి వారి నివాసంలో గణపతికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ప్రత్యేక పూజలు 1/5

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి వారి నివాసంలో గణపతికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ప్రత్యేక పూజలు 2/5

కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన గణేశ్ పూజ ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిచ్చిందని సీఎం తెలిపారు. గణపతి జ్ఞానానికి, వివేకానికి, విజయానికి ప్రతీక అని చెప్పారు. ఏ శుభకార్యాన్నైనా వినాయక పూజతో ప్రారంభించడం మన సంప్రదాయమని అన్నారు. విఘ్నాలను తొలగించి, సన్మార్గాన్ని చూపే చవితి వేడుకలు మనకు సామాజిక స్పృహను, ఐక్యతను నేర్పిస్తాయని వెల్లడించారు.

వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ప్రత్యేక పూజలు 3/5

సమష్టితత్వాన్ని బోధిస్తాయని.. సమాజాన్ని సన్మార్గంలో నడిపించేవి మన ధార్మిక కార్యక్రమాలని సీఎం వివరించారు. ఇందులో వాడవాడలా మండపాలతో జరిగే వినాయక చవితి వేడుకలు మరింత ప్రత్యేకమని వ్యాఖ్యానించారు.

వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ప్రత్యేక పూజలు 4/5

మన సంస్కృతికి, ఆధ్యాత్మిక చైతన్యానికి నిలువెత్తు ప్రతీకగా వినాయక చవితి వేడుకలు కనిపిస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు.

వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ప్రత్యేక పూజలు 5/5

వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని సీఎం చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి...ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా, తెలుగు జాతి వర్థిల్లేలా ఆనందంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Updated at - Sep 14 , 2026 | 02:19 PM