విజయవాడ ఉత్సవ్ 2.0.. సీఎంలు చంద్రబాబు, విజయ్ సందడి

ABN, Publish Date - Oct 14 , 2026 | 07:09 AM

విజయవాడలోని పున్నమి ఘాట్‌లో మంగళవారం జరిగిన విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ పాల్గొన్నారు. సంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన అనంతరం ఉత్సవాలను ఉద్దేశించి వారు ప్రసంగించారు.

విజయవాడ ఉత్సవ్ 2.0.. సీఎంలు చంద్రబాబు, విజయ్ సందడి 1/15

విజయవాడలోని పున్నమి ఘాట్‌లో మంగళవారం జరిగిన విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ పాల్గొన్నారు.

విజయవాడ ఉత్సవ్ 2.0.. సీఎంలు చంద్రబాబు, విజయ్ సందడి 2/15

సీఎం విజయ్ పర్యటన విజయవాడ ఉత్సవ్‌లో జోష్ నింపింది. ఆయనను చూడగానే యువత కేరింతలు కొట్టింది. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడింది.

విజయవాడ ఉత్సవ్ 2.0.. సీఎంలు చంద్రబాబు, విజయ్ సందడి 3/15

విజయవాడ నగరానికి వచ్చిన విజయ్ తొలుత ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో కలిసి సాయంత్రం పున్నమిఘాట్‌లో విజయవాడ ఉత్సవ్ సీజన్-2 కార్యక్రమాలను వీక్షించేందుకు హాజరయ్యారు.

విజయవాడ ఉత్సవ్ 2.0.. సీఎంలు చంద్రబాబు, విజయ్ సందడి 4/15

విజయ్ రాక సమాచారాన్ని తెలుసుకున్న యువత పున్నమిఘాట్ ప్రాంగణానికి భారీ సంఖ్యలో చేరుకుంది. సీఎం చంద్రబాబుతో కలిసి విజయ్ విజయవాడ ఉత్సవ్ ప్రాంగణానికి చేరుకోగానే, యువత ఈలలు, కేకలు, కేరింతలతో సందడి చేసింది.

విజయవాడ ఉత్సవ్ 2.0.. సీఎంలు చంద్రబాబు, విజయ్ సందడి 5/15

సీఎం విజయ్‌ను యువత మొబైల్‌లో బంధించింది. సీఎంలు ఇరువురు యువతకు అభివాదం చేస్తూ వేదిక ముందు ఆశీనులు అయ్యారు. సంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు.

విజయవాడ ఉత్సవ్ 2.0.. సీఎంలు చంద్రబాబు, విజయ్ సందడి 6/15

అందరికీ నమస్కారం అంటూ తెలుగులో విజయ్ ప్రసంగించారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా అదృష్టంగా ఉందని సీఎం విజయ్ వ్యాఖ్యానించారు. ఇక్కడకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

విజయవాడ ఉత్సవ్ 2.0.. సీఎంలు చంద్రబాబు, విజయ్ సందడి 7/15

నదుల అనుసంధానంపై చంద్రబాబుతో చర్చించేందుకు ఇక్కడకు వచ్చినందుకు ఆనందంగా ఉందని సీఎం విజయ్ వెల్లడించారు. ధ్యాంక్యూ విజయవాడ.. మీ అభిమానానికి తనను విజయవాడకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

విజయవాడ ఉత్సవ్ 2.0.. సీఎంలు చంద్రబాబు, విజయ్ సందడి 8/15

విజయవాడ ఉత్సవ్‌లో కళాకారులు తమ అద్భుతమైన ప్రతిభతో ప్రేక్షకులను అలరించారు. వివిధ కళారూపాలు, సంస్కృతిక కార్యక్రమాలు, సంగీత, నృత్య ప్రదర్శనలతో ఉత్సవ ప్రాంగణం సందడిగా మారింది.

విజయవాడ ఉత్సవ్ 2.0.. సీఎంలు చంద్రబాబు, విజయ్ సందడి 9/15

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, కళా వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ కార్యక్రమాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

విజయవాడ ఉత్సవ్ 2.0.. సీఎంలు చంద్రబాబు, విజయ్ సందడి 10/15

ఉత్సవంలో భాగంగా కళాకారులు శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలు, సంగీత కచేరీలు, గాన ప్రదర్శనలు నిర్వహించారు. సంప్రదాయ కళారూపాలతో పాటు ఆధునిక కళా ప్రదర్శనలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

విజయవాడ ఉత్సవ్ 2.0.. సీఎంలు చంద్రబాబు, విజయ్ సందడి 11/15

కళాకారులు తమ ప్రతిభను చాటుతూ ప్రదర్శించిన కార్యక్రమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా జానపద గీతాలు, సంప్రదాయ నృత్యాలు తెలుగు నేల సంస్కృతిని గుర్తు చేశాయి.

విజయవాడ ఉత్సవ్ 2.0.. సీఎంలు చంద్రబాబు, విజయ్ సందడి 12/15

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రత్యేక శైలిలో ప్రదర్శనలు ఇచ్చి ఉత్సవానికి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చారు. సంగీతం, నృత్యం, నాటకం వంటి కళారూపాల ద్వారా ప్రజలకు వినోదాన్ని అందించడంతో పాటు మన సంప్రదాయాలను పరిరక్షించాల్సిన అవసరాన్ని తెలిపారు.

విజయవాడ ఉత్సవ్ 2.0.. సీఎంలు చంద్రబాబు, విజయ్ సందడి 13/15

ఇలాంటి ఉత్సవాలు కళాకారులకు గుర్తింపు తీసుకురావడమే కాకుండా పర్యాటక రంగానికి, స్థానిక ఆర్థిక కార్యకలాపాలకు కూడా తోడ్పడతాయని పలువురు నేతలు తెలిపారు. విజయవాడ ఉత్సవ్‌లో కళాకారులు అందించిన వైవిధ్యభరిత ప్రదర్శనలు ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించాయని వివరించారు.

విజయవాడ ఉత్సవ్ 2.0.. సీఎంలు చంద్రబాబు, విజయ్ సందడి 14/15

విజయవాడ ఉత్సవ్ స్థానిక కళాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు మంచి వేదికగా నిలిచిందని పలువురు నేతలు వెల్లడించారు. కొత్తగా ఎదుగుతున్న కళాకారులకు ప్రోత్సాహం లభించడంతో పాటు ప్రజలకు మన సంస్కృతి, సంప్రదాయాలపై మరింత అవగాహన కలిగించే అవకాశం ఏర్పడిందని పలువురు నేతలు పేర్కొన్నారు.

విజయవాడ ఉత్సవ్ 2.0.. సీఎంలు చంద్రబాబు, విజయ్ సందడి 15/15

కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన సందర్శకులు ఈ కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. యువతతో పాటు పెద్దలు కూడా కళాకారుల ప్రదర్శనలను ఆస్వాదించారు.

Updated at - Oct 14 , 2026 | 07:43 AM