గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

ABN, Publish Date - Aug 25 , 2026 | 08:05 AM

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరులో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి సోమవారం గార్మె పాప్ కార్నికా నాన్-GMO పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఫ్యాక్టరీని, పాప్‌కార్న్ తయారీ విధానాన్ని పరిశీలించారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 1/30

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరులో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి సోమవారం గార్మె పాప్ కార్నికా నాన్-GMO పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించారు

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 2/30

అనంతరం ఫ్యాక్టరీని, పాప్‌కార్న్ తయారీ విధానాన్ని వారు పరిశీలించారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 3/30

ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, కొలుసు పార్థసారధి, కింజరాపు అచ్చెన్నాయుడు, గార్మె పాప్ కార్నికా ఎండీ ఎస్‌బీపీ పట్టాభిరామారావు, అధికారులు పాల్గొన్నారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 4/30

ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ప్రసంగించారు. రెండు నెలల క్రితం ఓ తమిళ పత్రికలో గౌర్మెట్‌ సంస్థ ఎండీ పట్టాభి సక్సెస్ స్టోరీని చదివానని ప్రస్తావించారు. ఒకే ఒక ఉత్పత్తిని ప్రపంచంలోనే గుర్తింపు తీసుకురావడంతో ఆయనను అభినందిస్తున్నానని ఉపరాష్ట్రపతి అన్నారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 5/30

జనవరి 14వ తేదీన దేశం అంతా కలిసి పంటల పండుగను జరుపుకుంటామని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో సంక్రాంతిగా, తమిళనాడులో పొంగల్, పంజాబ్‌లో లోహిరి, అసోంలో బిహుగా జరుపుకుంటారని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ వెల్లడించారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 6/30

రైతులకు వివిధ పథకాలను అమలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అభినందిస్తున్నానని ఉపరాష్ట్రపతి అన్నారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 7/30

డ్రోన్లను రైతులకు అద్దెకు ఇచ్చే పథకానికి కేంద్రం రూ.1200 కోట్లను మహిళా సంఘాలకు కేటాయించిందని ఉపరాష్ట్రపతి వివరించారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 8/30

పాప్‌కార్న్ మొక్కజొన్నను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం మానేసి, మనమే ఆ దేశానికి ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 9/30

ఎనిమిది రాష్ట్రాల్లో 17,500 రైతులు 40వేల ఎకరాల్లో పాప్‌కార్న్ మొక్కజొన్నను పండించడం మామూలు విషయం కాదని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తెలిపారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 10/30

ఈ ఏడాది దేవుని కృపతో పంటలకు అవసరమైన వర్షాలు పడతాయని.. దాని గురించి రైతులు ఆందోళన చెందవద్దని ఉపరాష్ట్రపతి చెప్పారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 11/30

మహనది నుంచి కావేరి నది వరకు నదుల అనుసంధానం కలగా మిగలదని, కొంత ఆలస్యం కావచ్చుగాని, వాస్తవ రూపం దాలుస్తుందని ఉపరాష్ట్రపతి వెల్లడించారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 12/30

మన ఆహర అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 13/30

మన ఆహార అవసరాలు తీర్చడానికి రైతులకు అవసరమైన సహాయ సహకారాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పేర్కొన్నారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 14/30

ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. మన దేశానికి రైతులే వెన్నెముక అని వ్యాఖ్యానించారు. వ్యవసాయం, అనుబంధ ఉత్పత్తులు మన దేశ ఆర్థిక వ్యవస్థలో 17శాతమని పేర్కొన్నారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 15/30

ఇతర రంగాల్లో సంక్షోభం ఉన్నా, వ్యవసాయం దానిని స్థిరీకరించిందని గవర్నర్ తెలిపారు. శాస్త్రవేత్తలు కరువును తట్టుకునే విత్తనాలను పరిశోధించాలని సూచించారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 16/30

గతంలో 70 శాతం పాప్‌కార్న్ ఉత్పత్తుల సొమ్ము అర్జెంటీనా, బ్రెజిల్ దేశాలకు వెళ్లేదని గవర్నర్ అబ్దుల్ నజీర్ వివరించారు. ఇప్పుడు అది మన దేశ రైతులకు వస్తుందని తెలిపారు. శాస్త్రవేత్తలు కరువును తట్టుకునే విత్తనాలను పరిశోధించాలని గవర్నర్ పేర్కొన్నారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 17/30

ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 18/30

వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు ప్రాసెసింగ్‌ విలువలు జోడించి ఓ మంచి బ్రాండ్‌తో అంతర్జాతీయ మార్కెట్లకు తరలిద్దామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అప్పుడే దీని విలువ పెరిగి రైతులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 19/30

స్వదేశీ విధానంతో వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల్లో స్వయంసమృద్ధి సాధించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయాలన్నదే కేంద్రం, రాష్ట్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాల ఆలోచన అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 20/30

వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా, రైతులను పారిశ్రామికవేత్తలుగా చూడాలన్నదే తమ సంకల్పమని సీఎం అన్నారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 21/30

రైతులు ఉత్పత్తి చేసే పంటలకు విలువలను జోడించి ఎగుమతి చేయాలన్నదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధ్యేయమని సీఎం చంద్రబాబు తెలిపారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 22/30

పసుపు, మిరప, మొక్కజొన్న, ఆక్వా తదితర ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌కు చేరాలని సీఎం ఆకాంక్షించారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 23/30

ఆసియా మార్కెట్‌ నుంచి ప్రపంచంలోని పాప్‌కార్న్‌ గ్లోబల్‌ మార్కెట్‌ను విస్తరించే స్థాయికి ఏపీ ఎదుగుతుందని సీఎం ఆకాంక్షించారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 24/30

దేశీయంగా మొక్కజొన్న విత్తన ఆవిష్కరణ శుభ పరిణామమని సీఎం చంద్రబాబు తెలిపారు. మామూలుగా పనిచేస్తే జీవితాలు మూమాలుగానే ఉంటాయని... వినూత్నంగా పనిచేస్తేనే ఎదుగుదల సాధిస్తామని గౌర్మెట్‌ నిరూపించిందని సీఎం పేర్కొన్నారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 25/30

మన నూజివీడు గడ్డపై పండించే పాప్‌కార్న్‌ మొక్కజొన్న దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 26/30

వినూత్నంగా పనిచేస్తేనే ఎదుగుదల సాధిస్తామని గౌర్మెట్‌ నిరూపించిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అరకు కాఫీ, పాప్‌కార్న్‌ రైతులపై ఉన్న ప్రేమాభిమానాలతో ఉపరాష్ట్రపతి ఇక్కడకు వచ్చి.. జన్యుమార్పిడి జరగని మొక్కజొన్న విత్తనాలను ఆవిష్కరించారని అన్నారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 27/30

దేశీయంగా మొక్కజొన్న విత్తన ఆవిష్కరణ శుభ పరిణామమని సీఎం చంద్రబాబు తెలిపారు. మామూలుగా పనిచేస్తే జీవితాలు కూడా మూమాలుగానే ఉంటాయని వెల్లడించారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 28/30

యాంత్రీకరణ, విత్తనాల సాగులో సాంకేతికత, రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు.. ఇలా అన్నీ వ్యవస్థీకృతం చేసిన గౌర్మెట్‌ సంస్థకు సీఎం చంద్రబాబు అభినందనలు చెప్పారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 29/30

'గౌర్మెట్ పాప్ కార్నికా' విత్తన ఆవిష్కరణలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు.

గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి 30/30

మొక్కజొన్న రైతుల సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని లోకేశ్ పేర్కొన్నారు.

Updated at - Aug 25 , 2026 | 01:27 PM