తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి
ABN, Publish Date - Sep 08 , 2026 | 11:00 AM
తిరుమలలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వర స్వామి వారిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సందర్శించుకున్నారు. అక్కడి అద్భుతమైన ఏర్పాట్లు, పరిశుభ్రత, ఆధ్యాత్మిక వాతావరణం తన మనస్సును పరవశింపజేశాయని ఆయన తెలిపారు.
1/7
తిరుమలలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం సందర్శించుకున్నారు.
2/7
తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన యూపీ సీఎంను పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికిన టీటీడీ జేఈవో వెంకయ్య చౌదరి.
3/7
ధ్వజస్తంభానికి నమస్కరించుకున్న సీఎం యోగి.. అనంతరం గర్భాలయంలో మూలవిరాట్టును దర్శించుకున్నారు.
4/7
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు.
5/7
ఆలయంలోని రంగనాయకుల మండపంలో స్వామి వారి చిత్రపటాన్ని యూపీ సీఎంకు అందజేసిన ఆలయ అధికారులు
6/7
సాక్షాత్తూ విష్ణుమూర్తి అవతారమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన సజీవ క్షేత్రం తిరుమల అని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
7/7
సీఎం ఆదిత్యనాథ్ వెంట మంత్రులు సత్యకుమార్ యాదవ్, నారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, బీజేపీ నాయకులు భానుప్రకాశ్‌రెడ్డి, కోలా ఆనంద్ తదితరులు ఉన్నారు.
Updated at - Sep 08 , 2026 | 11:18 AM