నరసరావుపేటలో రుణ వితరణ కార్యక్రమం.. పాల్గొన్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Jul 18 , 2026 | 08:23 AM
నరసరావుపేటలో రుణ వితరణ కార్యక్రమానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 1,03,246 మందికి రూ.3,216 కోట్ల రుణాల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
1/19
నరసరావుపేటలో రుణ వితరణ కార్యక్రమానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 1,03,246 మందికి రూ.3,216 కోట్ల రుణాల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
2/19
ఒక రైతు భవిష్యత్తు మారేందుకు, యువకుల ఆశయ సాధనకు, మహిళా సాధికారతకు, పారిశ్రామికవేత్తల కలలకు ‘రుణ వితరణ’ పెట్టుబడిగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
3/19
అప్పు కోసం ఒకప్పుడు సూక్ష్మ రుణ సంస్థలు, ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై ఎక్కువగా ఆధారపడేవారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
4/19
అధిక వడ్డీ, చక్రవడ్డీలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ పరిస్థితులు ప్రభుత్వాలకు కూడా సవాల్‌గా ఉండేవని చెప్పుకొచ్చారు.
5/19
కేంద్రప్రభుత్వం రూ.15,000 కోట్లు ఇచ్చి నిలిచిపోయిన అమరావతి పనులకు జీవం పోసిందని సీఎం చంద్రబాబు వివరించారు.
6/19
కేంద్రం బ్యాంకుల ద్వారా అమరావతి అభివృద్ధికి ఆర్థిక చేయూత అందిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.
7/19
పోలవరానికి రూ.12,155 కోట్లను కేంద్రం ఇచ్చిందని సీఎం చంద్రబాబు వివరించారు. పోలవరం 2027 మార్చి లోపు పూర్తి చేసి మొదటి దశను జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు.
8/19
విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,440 కోట్లను కేంద్రం ఇచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వీబీ జీరామ్‌జీ పథకం కింద రూ.7,700 కోట్లు, జల్‌జీవన్ మిషన్ కింద రూ.28,000 కోట్లు తెచ్చుకోగలిగామని తెలిపారు.
9/19
రాయలసీమను హార్టీ కల్చర్ హబ్‌గా తయారు చేయడానికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెడుతుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇందులో రూ.40,000 కోట్లు కేంద్రం సహకారంతో రుణం తీసుకుంటున్నామని వివరించారు.
10/19
కొంత గ్రాంట్‌గా కూడా కేంద్రం ఇచ్చిందని చెప్పారు. రూ.60,000 కోట్ల విలువైన ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
11/19
పల్నాడు జిల్లాలో పారాల్సింది రక్తం కాదని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇక్కడ పారిశ్రామిక విప్లవం రావాలని ఆకాంక్షించారు. ఈ ప్రాంతాన్ని పారిశ్రామికాభివృద్ధికి చిరునామాగా నిలుపుతామని ఉద్ఘాటించారు.
12/19
ఒకప్పుడు బ్యాంకు రుణం పొందడం కష్టంగా ఉండేదని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్లి రుణాలు అందించడం.. ఇటువంటి రుణ మేళాలు నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు.
13/19
ఒక్కొక్క కుటుంబానికి ఐదు మందిని లెక్కిస్తే ఈ జిల్లాలో ఐదు లక్షల మందికి బ్యాంకుల నుంచి రుణాలు అందాయని సీఎం చంద్రబాబు వివరించారు.
14/19
వ్యవసాయం కోసం 84,393 మందికి రూ.2,363 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగం నుంచి 4,449 యూనిట్లకు రూ.335 కోట్లు, గృహ, వాహన, సౌర విద్యుత్ వంటి వాటికి సంబంధించి 10,228 ఖాతాలకు రూ.624 కోట్లు, వివిధ పథకాల కింద రూ.2500 కోట్లు పంపిణీ చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. బ్యాంకులు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలే కాదని... రాష్ట్రాభివృద్ధిలో కూడా భాగస్వాములని తెలిపారు.
15/19
ప్రతి గ్రామానికి బ్యాంక్ సేవలు విస్తరించడమే మోదీ సర్కార్ లక్ష్యమని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. 2014 నుంచి గ్రామాలకు బ్యాంక్ సేవలను ఎక్కువగా అందజేయడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. గతంలో నిరార్థక ఆస్తులతో బ్యాంకుల పనితీరు బాగుండేది కాదని చెప్పుకొచ్చారు.
16/19
బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామని నిర్మలా సీతారామన్ తెలిపారు. వీధి వ్యాపారులకు గ్యారంటీ లేకుండా లోన్లు వచ్చేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు.
17/19
ప్రభుత్వమే వారికి అండగా నిలబడి లోన్లు అందజేస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
18/19
ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించడానికి తాము చర్యలు చేపట్టామని మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. సమాజంలోని ప్రతి కుటుంబం సంక్షేమం, సంతోషం, ఆర్థిక భద్రత సాధించేలా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
19/19
పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
Updated at - Jul 18 , 2026 | 09:19 AM