ఉండవల్లిలో వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించిన బిల్‌గేట్స్
ABN, Publish Date - Feb 16 , 2026 | 05:00 PM
ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ సోమవారం సందర్శించారు.
1/11
ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ సోమవారం సందర్శించారు.
2/11
అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు.
3/11
రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంభిస్తున్న ఏఐతో సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా బిల్‌గేట్స్‌కు వివరించారు.
4/11
డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలు నివారిస్తున్న తీరును స్వయంగా పొలంలోకి వెళ్లి గేట్స్ తిలకించారు.
5/11
అనంతరం అక్కడ రైతులతో బిల్‌గేట్స్ ముఖాముఖిలో భాగంగా చర్చించారు.
6/11
వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, బిల్‌గేట్స్‌కు మహిళా రైతులు ఘన స్వాగతం పలికారు.
7/11
ఈ సందర్భంగా మహిళలు స్వయంగా వండి తీసుకొచ్చిన స్థానిక వంటలను బిల్‌గేట్స్ రుచి చూశారు.
8/11
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ టెక్నాలజీ ఆధారిత వ్యవసాయ విధానాలను అమలు చేయడం, రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడం, వ్యవసాయాన్ని లాభదాయక రంగంగా మార్చడం వంటి లక్ష్యాలతో కూటమి సర్కార్ ముందుకు సాగుతోంది. ఈ ప్రయత్నాలు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయి.
9/11
భవిష్యత్తులో టెక్నాలజీ ఆధారిత వ్యవసాయం మరింత విస్తరించి రైతులకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుందని బిల్‌గేట్స్ అభిప్రాయపడ్డారు.
10/11
డ్రోన్లు, ఏఐ, డేటా ఆధారిత వ్యవసాయం వంటి సాంకేతిక విధానాలను అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం కొత్త దిశగా ముందుకు సాగుతోంది. ఈ మార్పులు రైతుల ఆదాయాన్ని పెంచడం, పంటల నష్టాలను తగ్గించడం, వ్యవసాయాన్ని స్థిరంగా అభివృద్ధి చేయడం వంటి లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతున్నాయి.
11/11
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ద్వారా పంటల స్థితిని విశ్లేషించడం, వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేయడం, సరైన సమయంలో చర్యలు తీసుకోవడం వంటి అంశాలు రైతులకు ఎంతో సహాయపడుతున్నాయి. ఈ విధానాలు వ్యవసాయాన్ని ఆధునికీకరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
Updated at - Feb 16 , 2026 | 05:07 PM