TANA, TAMA కమ్యూనిటీ రక్తదాన శిబిరం: అట్లాంటా యూఎస్
ABN , Publish Date - Aug 12 , 2026 | 06:47 PM
సేవా స్ఫూర్తి, మానవత్వానికి ప్రతీకగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA), తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా(TAMA) సంయుక్తంగా, అమెరికన్ రెడ్ క్రాస్ భాగస్వామ్యంతో, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా(CGI), అట్లాంటా సహకారంతో కమ్యూనిటీ రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించాయి.
ఇంటర్నెట్ డెస్క్: సేవా స్ఫూర్తి, మానవత్వానికి ప్రతీకగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA), తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా(TAMA) సంయుక్తంగా, అమెరికన్ రెడ్ క్రాస్ భాగస్వామ్యంతో, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా(CGI), అట్లాంటా సహకారంతో కమ్యూనిటీ రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించాయి.
యూఎస్ అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం, అవసరంలో ఉన్నవారికి అండగా నిలిచి ప్రాణాలను కాపాడాలనే గొప్ప లక్ష్యంతో కమ్యూనిటీని ఒక్కతాటిపైకి తీసుకొచ్చింది. ఈ కార్యక్రమానికి మార్గదర్శకత్వం, సహకారం అందించిన TANA/TAMA నాయకత్వానికి శ్రీనివాస్ లావు (Executive Vice President), సోహిని అయినాల (Women Services Coordinator Secretary), శేఖర్ కొల్లు (RR), మధుకర్ యార్లగడ్డ (Foundation Trustee / TAMA Chairman), భరత్ మద్దినేని (Board Director), సునీల్ దేవరపల్లి (Social Welfare Coordinator), సునీత పొత్నూరు (TAMA President)కు నిర్వాహకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అంకితభావంతో కృషి చేసిన స్థానిక TANA/TAMA బృందం చైతన్య కొర్రపాటి, దీప్తి తాళ్లూరి, మాలతి నాగభైరవ (Kalasala Chair, TANA), ఆర్తిక (Matrimonial Chair, TANA), తిరు చిల్లపల్లి (TAMA President Elect)కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, అట్లాంటా కాన్సుల్ జనరల్ శ్రీ రమేష్ బాబు లక్ష్మణన్ గారు హాజరయ్యారు. వారి సమక్షం ఈ సేవా కార్యక్రమానికి మరింత ప్రాధాన్యాన్ని తీసుకువచ్చింది.



'అన్నింటికంటే ముఖ్యంగా ఈ మహత్తర కార్యక్రమంలో ముందుకు వచ్చి రక్తదానం చేసిన ప్రతి దాతకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన నాయకులు, సమన్వయకర్తలు, వలంటీర్లు, కుటుంబ సభ్యులు, కమ్యూనిటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సేవా భావంతో ఒక కమ్యూనిటీ ఒక్కటైతే, ప్రతి రక్తదానం మరొకరి జీవితానికి కొత్త ఆశను, మరో అవకాశాన్ని అందించగలదని TANA, TAMA మరోసారి నిరూపించాయి' అని నిర్వాహకులు పేర్కొన్నారు.



చివరగా 'రక్తదానం చేయండి • ప్రాణాలను కాపాడండి • సమాజాన్ని బలోపేతం చేయండి' అంటూ ఈ కార్యక్రమాన్ని ముగించారు.
ఇవీ చదవండి:
డాలస్‌లో తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి మునిరత్నం నాయుడికి ఘనస్వాగతం
టెన్జింగ్-హిల్లరీ ఎవరెస్ట్ మారథాన్ పూర్తిచేసిన తానా బోర్డ్ చైర్మన్